Twist Story ఎపీలోని మచిలీపట్నానికి చెందిన తనుశ్రీ మేకప్ వేసి యువకులకు వలపు విసురుతోంది. వలలో పడ్డారా అంతే.. ఈమెను మేకప్ లేకుండా చూస్తే ఇన్స్టాలో మనం చూస్తే కత్తిలాంటి ఫిగర్ ఈమె నా అని అనుకుంటాం. కానీ ఒన్స్ మేకప్ వేసి పాటకి స్టెప్ వేసి కళ్ళతో కసిగా చూసిందంటే చాలు మనం పడిపోతాం. లైక్ కొట్టేస్తాం లైక్ కొట్టగానే హాయ్ అంటూ తనుశ్రీ నే పలకరిస్తుంది.నేను నచ్చానా..? డాన్స్ నచ్చిందా..? నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది.అంటూ చాటింగ్ మొదలు పెడుతుంది. ఆ తర్వాత తనకు తానుగా మీకు ఫోటోలు పంపుతుంది. వాటిని చూసి మీరు వావ్ అనేస్తారు.తర్వాత మనం మంచి స్నేహితులు అవుదాము కాఫీకి వెళదామా,పార్టీలు చేసుకుందామా అంటూ ముగ్గు లోకి దింపేస్తుంది.

ఆ తర్వాత నెమ్మదిగా నెంబర్ తీసుకుని తనే చనవ తీసుకొని కాల్ చేస్తుంది. మీకు ఓకే అయితే మనం ప్రైవేట్ గా గడుపుదాం.లేదంటే బయట సినిమాకి వెళ్దామా పార్కు వెళ్దామా అంటూ కవ్విస్తుంది.ఇంకేముంది కసిగా ఆమెతో స్నేహం చేసి పరిచయం పెంచుకున్న తర్వాత కొద్దిరోజులకి అమ్మ హాస్పిటల్ లో ఉంది.చెల్లెలికి అనారోగ్యంగా ఉంది. అని లక్షల్లో గుంజేస్తుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది మోసపోయారు. తను కవ్వించే ఫోటోలతో పాటలతో డాన్సులు చేస్తూ రెచ్చిపోయిన తనుశ్రీకి హైదరాబాద్ ఓ యువకుడు పడిపోయాడు. అతడు లైక్ కొట్టగానే వెంటనే హాయ్ అంటూ మెసేజ్ పెట్టి పరిచయం పెంచుకుంది.
ఆ తర్వాత యువకుడు ఆవేశం స్టార్ లా రెచ్చిపోయి ఫోన్ నెంబర్ అడిగి మరి మాటలు కలిపాడు. మేకప్ వేసుకొని వెళ్ళి పర్సనల్గా కలిసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.అమ్మ చావు బతుకుల్లో ఉంది. ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి. అని లక్షల్లో వసూలు చేసింది. అలా దాదాపుగా 31,లక్ష 66,000 లా వరకు గుంజింది.అయితే ఈ మేకప్ కిలాడి వెనుక ఓ యువకుడు కూడా ఉన్నాడు. తేర వెనక స్కెచ్ వేసేది రవితేజ ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా పాట పాడి నట్టించి, నమ్మించి,ముంచేది ఈ తనుశ్రీ.. అయితే పోలీసులు ఆరా తీయగా ఇద్దరూ బయటపడ్డారు.