Infinix Smart TV : ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీలు కొనే వారి సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్ అలాగే అమెజాన్ కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోని తాజాగా ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ పై ఏకంగా 47% డిస్కౌంట్ ప్రకటించి మరింతగా కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇకపోతే మీరు కూడా స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఒకసారి ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకొని ఆ తర్వాత ముందడుగు వేయడం మంచిది. మరి ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ మోడల్, ధర ,స్పెసిఫికేషన్స్ ఇలా అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫినిక్స్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ..Linux ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. ఇక మార్కెట్లోకి ఈ స్మార్ట్ టీవీ ని ప్రవేశపెట్టినప్పుడు అసలు ధర రూ.16,999.. కానీ ఫ్లిప్కార్ట్ తమ కస్టమర్లకు 47% డిస్కౌంట్ తో కేవలం.. రూ.8,999 కే అందిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు , ఫెడరల్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.900 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.8,099 కే కొనుగోలు చేయవచ్చు. 60 Hz రీఫ్రెష్ రేట్ తో, 20 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.
1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది.. అంతేకాదు సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటిటి యాప్స్ కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 4 హెచ్డిఎంఐ స్లాట్ , 2 యు ఎస్ బి స్లాట్ , సింగిల్ బ్యాండ్ వైఫై, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ తో పాటు మరెన్నో కనెక్టివిటీ ఆప్షన్లను కూడా అందించారు. ఈ స్మార్ట్ టీవీ ఏకంగా కస్టమర్ నుంచి 4.2 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇతర స్మార్ట్ టీవీ లతో పోల్చుకుంటే ఈ స్మార్ట్ టీవీ మీకు బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్స్ తో లభిస్తూ ఉండడం గమనార్హం.