Infinix Smart 6 Plus : ఇండియన్ మార్కెట్లోకి ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి టెక్ తయారీ సంస్థలు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ అయినటువంటి ఇన్ఫినిక్స్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది.. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 ప్లస్ పేరిట రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడం గమనార్హం.. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఒకటేమో 6.6 అంగుళాల డిస్ప్లే తో ప్యానెల్ కంటే పెద్దది అని చెప్పాలి. మరొకటి 6.8 అంగుళాల డయాగ్నల్ స్క్రీన్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది ముఖ్యంగా రెండు స్క్రీన్లు కూడా ఒకే రిజల్యూషన్ తో పనిచేస్తాయి. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ మిర్రర్ బ్యాక్ డిజైన్ తో లభిస్తుంది.
అంతేకాదు ఒరిజినల్ మోడల్ వెనుక కవర్ ఆరా వేవ్స్ టెక్చర్ డిజైన్.. యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్ కోట్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ముఖ్యంగా రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ మొబైల్ లభిస్తూ ఉండడం గమనార్హం. రెండు వేరియంట్ లలో కూడా కెమెరా డిజైన్ సెటప్ భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా A1 లెన్స్ లతో 8 ఎంపీ ప్రైమరీ సెన్సార్లు ఉన్నాయి. అంతేకాదు సెల్ఫీ కెమెరాలు కూడా భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒరిజినల్ మోడల్ లో 8 ఎంపీ సెల్ఫీ షూటర్ ఓకే ఫ్లాష్ లైట్ తో లభిస్తుంది. ఇక ఇండియన్ వెర్షన్ లో లెఫ్ట్ , రైట్ సైడ్లలో ఎల్ఈడి ఫ్లాష్ .. 5 ఎంపీ సెల్ఫీ సూట్ కెమెరా లభిస్తుంది. ముఖ్యంగా 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను అందిస్తుంది.
ఇక అంతేకాదు 6GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మైక్రో ఎస్డి కార్డ్ కోసం ప్రత్యేకమైన స్లాట్ కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే వీలు ఉంటుంది. ఇక ఒరిజినల్ స్మార్ట్ సిక్స్ ప్లస్ విషయానికి వస్తే 2 జి బి ర్యామ్ ,32 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇకపోతే ఇన్ఫినిక్స్ స్మార్ట్ సిక్స్ ప్లస్ వెర్షన్ లో ఇతర హైలెట్స్ ఏమిటంటే రెండు మోడల్స్ కూడా 5000 mah బ్యాటరీలతో లభిస్తాయి. ఇక కలర్ విషయానికి వస్తే మిరాకిల్ బ్లాక్ , ట్రాంక్విల్ సీ బ్లూ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్లిప్కార్ట్ ద్వారా ఆగస్టు 3వ తేదీ నుంచి రూ.7,999 ప్రారంభ ధరతో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి.