Infinix Note 12 Pro : ఎవరైనా సరే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలి అని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం తాజాగా ఇన్ఫినిక్స్ రిలీజ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4G సేల్ ప్రారంభమయ్యింది . స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి వివరాలు ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్, ధరలు ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ నోట్12 ప్రో 4G మోడల్ ను తాజాగా ఇన్ఫినిక్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ప్రాసెసర్ తో లాంచ్ చేసింది. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 5జి మొబైల్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు 4G వేరియంట్ నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో G99 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే మీడియా టెక్ రూపొందించిన ఈ కొత్త ప్రాసెసర్ తో రిలీజ్ అయిన మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. రూ. 20వేల లోపు లభించే బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 4G స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే వేరియంట్ లో లభించడం గమనార్హం.8GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం అయింది . ఇక మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేసి 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాదు ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ద్వారా మరో 500 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్ వర్తించిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.14,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రూ.1,099 విలువైన Snokor XE 18 TWS ఇయర్ బర్డ్స్ ని కేవలం ఒక్క రూపాయికే సొంతం చేసుకోవచ్చు. ఇక పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసే వారికి ఏకంగా రూ.16,250 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 108 మెగాపిక్సల్ ప్రధాన రియల్ కెమెరా తో పాటు 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అమరుచారు.33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది.