Infinix 12 Pro : ముఖ్యంగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ తాజాగా తన కంపెనీ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో ను లాంచ్ చేయడం జరిగింది. కేవలం రూ.10 వేల లోపే లభించడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి పూర్తిగా చదివి తెలుసుకుందాం. ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ అలాగే 64GB మరియు 128 GB స్టోరేజ్ వేరియంట్లలో ప్రకటించడం జరిగింది. ఇక వీటి ధరల విషయానికి వస్తే 8GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999 కాగా 8 GB ర్యామ్ – 128 GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ద్వారా రూ.11,999.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై ఆఫర్ పొందాలి అనుకుంటే ఐసిఐసిఐ అలాగే కోటక్ కార్డ్స్ లేదా ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఈ ఆఫర్లతో మొత్తం మీకు 1000 రూపాయల వరకు ఆఫర్ లభిస్తుందని చెప్పవచ్చు. అంటే బేసిక్ మోడల్ ను మీరు కేవలం రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు.ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే..
డ్యూయల్ కెమెరా సెట్ అప్ ను వెనుక భాగంలో కలిగి ఉంటుంది 50 ఎంపీ ప్రధాన కెమెరా కి డెప్త్ సెన్సార్ కూడా అటాచ్ చేసారు. ఇక సెల్ఫీ కోసం 8MP కెమెరా అందించడం జరిగింది. ముఖ్యంగా టైప్ సి చార్జింగ్ పోర్టుతో 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీతో లభిస్తుంది. అంతేకాదు డిటిఎస్ సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో పాటు ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఎక్స్ ఓ ఎస్ సాఫ్ట్వేర్ పై ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది.. 6.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇక 90Hz రిఫ్రెష్ రేటు తోపాటు 180 Hz టచ్ శాంపియన్ రేటుతో నడుస్తుంది.