Inaya: ఇనయా సుల్తానా.. బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 6 లో ఆర్జీవి బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా.. విజేతగా నిలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్ ను కలిసింది..

అంతేకాదు తన మనసులో ప్రేమను బయట పెడుతూ ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్ చేసింది ఇనయా. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయా.. అయితే ఇనయ సొహెల్ పెళ్లిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. సోహెల్ క్యారెక్టర్ మీద ఏదో రూమర్ ఉందని అది నిజం అని వాళ్ళు అనుకుంటున్నారట. అయితే ఇనయ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ వస్తాయి. ఆ రూమర్ ని మీరు నిజం అని నమ్మడం కరెక్ట్ కాదు అని ఇంట్లో వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ.. ఇనయ మాట వాళ్ళ పేరెంట్స్ వినడం లేదని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.