Wife : మనిషి జీవితంలో పెళ్లి అనేది అత్యంత కీలకమైన ఘట్టం. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారు పెళ్లయిన తర్వాత మునుపటిలా మనల్ని ప్రేమించకపోతే మనసుకు బాధ కలుగుతుంది.. ఇలా చాలా కుటుంబాలలో జరుగుతుంది. అలాగే ఆ మనస్పర్ధలు గొడవలకు దారి తీసి విడాకులకు కూడా దారితీస్తూ ఉంటాయి. నిజానికి వారి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనేది చాలామంది ఆలోచించరు. ఒక భార్య తన భర్తతో కూర్చుని మాట్లాడుకొని సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఉదాహరణకు ఒక సెలవు రోజున ఇంట్లో తన భర్త (సురేష్) (పేరు మార్చబడింది) మొబైల్ చూస్తూ ఉన్న సమయంలో భార్య(సురేఖ) పక్కన వెళ్లి కూర్చుంది. మీతో మాట్లాడాలి.. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని కోరింది సురేఖ . మొదట నిరాకరించినా. సురేఖ ఫేస్ డల్ గా ఉండడం చూసి సురేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత విషయం ఏంటని అడగగా .. సురేఖ ఇలా చెప్పడం మొదలు పెట్టింది.. మీరు ఎందుకు పెళ్లికి మునుపటిలా ఉండడం లేదు. నాపై అప్పుడు చాలా ప్రేమ చూపించేవారు కవ్వించేవారు కానీ ఇప్పుడు మీలో రోజుకో కొత్తకోణం చూస్తున్నాను ఎక్కువసేపు ఆఫీసు వర్క్ లేదా ఫోన్ కి మాత్రమే సమయం కేటాయిస్తున్నారు.
నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు.. నాలో ఏదైనా మార్చుకోవాలి అంటే మార్చుకుంటా అంటూ సురేఖ చెప్పడం ఆపేసింది. అయితే అప్పుడు సురేష్ చెప్పిన మాట వింటే మాత్రం మతిపోతుంది. సురేష్ చిరునవ్వు నవ్వి..” ఇప్పుడు మనం ఏదైనా బంగారం కొన్నాము అనుకో.. దానిని కొంతకాలం మాత్రమే అపురూపంగా చేస్తాం అందరికీ చూపించుకోని మురిసిపోతాం. తర్వాత బీరువా లాకర్లో పెట్టుకుంటాం ..అంతే తప్ప అస్తమానం దానిని చూస్తూ కూర్చోలేము కదా” అంటూ సురేష్ వివరించాడు. తరువాత సురేఖ మాట్లాడుతూ బంగారాన్ని ఉంచుకుంటాం.. మొక్కలను పెంచుకుంటూ.. ఒక్క వాక్యం లోనే తేడాని అర్థం చేసుకోవచ్చు. మనుషులు కూడా అంతే అండి వారితో ప్రేమానురాగాలను పంచుకుంటేనే సంతోషంగా ఉంటారు అని ఆమె చెప్పింది.. అయితే ఆమె ఏమి చెప్పదలుచుకున్న అర్థం చేసుకున్న సురేష్ ఆమె వైపు చూసి ప్రేమగా నవ్వాడు.. ఆమె వైపు కురిపిస్తున్న ప్రేమతో కూడిన నవ్వులకు ఉన్న తేడాను ఆమె స్పష్టంగా గుర్తించి సంతృప్తిగా అతని గుండెల పై వాలిపోయింది.