Parlament : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ ఎంపీ మార్గాన్ని భరత్ విజ్ఞప్తి చేశారు. గురువారం లోక్ సభలో బడ్జెట్ ఫై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.. అశాస్త్రీయగా రాష్ట్ర విభజనను చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాలతో బర్త్డే కేకును కోసినట్లుగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఉద్యమం కారణంగా నాలుగేళ్లు.. ఆ తరువాత గత తొమ్మిదేళ్లుగా విభజన సమస్యలతో.. అభివృద్ధిలో మొత్తం 13 ఏళ్ల సమయాన్ని కోల్పోయాం.. రాష్ట్ర విభజన చట్టాన్ని కేంద్రం ఎందుకు గౌరవించడం లేదు.. హామీలను ఎందుకు అమలు చేయడం లేదు.. 2019 – 20 అంచనా వ్యయాలను సవరిస్తే ఇప్పుడు 2023లో ఉన్న ఇంకెంత వ్యయం పెరగాలి.. ఇదంతా ప్రజాధనం మనం మన జేబులో నుంచి ఇవ్వడం లేదు..
అంచనా వ్యాయాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రజాధనాన్ని మనం వృధా చేస్తున్నాం . సాంకేతిక లోపాల వల్ల డయాఫ్రం వాలుకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించలేదు. ఏడాది కాలంగా ప్రాజెక్టు నిలిచిపోయింది.. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పరిగణలోకి తీసుకోవాలి.
ఏపీలో పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి. కేజీ బేసిన్ నుంచి ఆయిల్ ను గుజరాత్ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అని ఎంపీ భరత్ ఆరోపించారు. అంతేకాకుండా ఈ సమస్యలన్నీ లోక్ సభ స్పీకర్ కి అర్థమయ్యేలా హిందీలో ఓ కవిత్వం కూడా చెప్పారు.. దానికి స్పీకర్ నవ్వుతూ అక్కడ ఉన్నది భరత్ అంటూ ఆయన కూడా నవ్వారు.