Post Office Scheme : పోస్ట్ ఆఫీస్.. ధనిక.. పేద.. గ్రామీణ.. అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ఏకైక బ్యాంక్ అని చెప్పవచ్చు.. ఇందులో వంద రూపాయలు నుంచి కూడా మనం దాచుకోవడానికి వీలు ఉంటుంది. అసంఘటిత రంగాల వారు కూడా ఇందులో డబ్బులు దాచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖలో రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల నిర్ణీత సమయం ముగిసిన తరువాత ఏకంగా కొన్ని లక్షల రూపాయలను సొంతం చేసుకునే అవకాశం కూడా కల్పించబడడం గమనార్హం.
ఇక పోతే ఎవరైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ రాబడి పొందాలని ఆలోచించే వారికి ఈ పోస్ట్ ఆఫీస్ ప్రస్తుతం సరికొత్త స్కీం ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల కేవలం అతి తక్కువ సమయంలోనే 14 లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక సీనియర్ సిటిజన్ స్కీమ్ లో డబ్బులు పెట్టే వాళ్ళు కేవలం ఐదు సంవత్సరాల లోపే ఏకంగా రూ. 14లక్షల రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ పథకంలో 7.4 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు. అందుకే ఈ పథకానికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని పేరు పెట్టడం జరిగింది.కనిష్టంగా వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు నెలకు ఇన్వెస్ట్ చేయవచ్చు. సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఉదాహరణకు మీరు ఐదు సంవత్సరాలకు గానూ ఒకేసారి పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే ఐదు సంవత్సరాల తర్వాత మీ చేతికి.. రూ.14,28,964 వస్తుంది. ఇక ఈ డబ్బుతో వృద్ధాప్యంలో ఆర్థికంగా సంతోషంగా జీవించవచ్చు.