IB Recruitment 2023: ప్రస్తుత రోజుల్లో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిపోయింది. భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో రాజకీయ నాయకులు నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని రకరకాల హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చే పరిస్థితి నెలకొంది. ఒకపక్క వయసు అయిపోవటం మరోపక్క పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వాలు ఉండటంతో చాలామంది.. చదువుకున్న యువత దిగజారి పనిచేయలేకపోతున్నారు. అటు ఉద్యోగాలు లేక ఇటు పని చేసుకోలేక ఆత్మ అభిమానం చంపుకుని బతికే పరిస్థితి నెలకొంది.
ఇటువంటి క్రమంలో నిరుద్యోగులకు ఇంటిలిజెంట్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏకంగా 677 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చింది. టెన్త్ పాస్ అయిన స్త్రీలు లేదా పురుషులు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 13 చివరి తారీకు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు తెలంగాణ రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. అన్నీ కూడా పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లను పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 14 నుండి నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నవంబర్ 13 లోపు అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలంటే www.mha.gov.in లేదా www.NCS.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలు ఈ వెబ్ సైట్ లలో ఇంటిలిజెంట్ బ్యూరో పొందుపరచడం జరిగింది.