Ear Buds : నోకియా మరో ముందడుగు.. ఇన్ బిల్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ తో..!

Ear Buds : ఫీచర్డ్ ఫోన్ తోనే కస్టమర్లను ఆకట్టుకున్న నోకియా ఈ మధ్యకాలంలో చాలా వేగంగా తమ బ్రాండ్ ను విస్తరించే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే నోకియా ఫ్లిప్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇకపోతే మార్కెట్లో తిరుగులేని ఆదిపత్యం చూపించిన నోకియా ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఫీచర్ ఫోన్ లాంచ్ చేసి మొబైల్ మార్కెట్ ను ఆశ్చర్యపరిచింది.. ఇకపోతే తాజాగా నోకియా ప్రవేశపెట్టిన నోకియా 5710 ఎక్స్ ప్రెస్ ఆడియో ఫీచర్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. అంటే ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఫోన్లోనే బిల్ట్ ఇన్ వైర్లెస్ ఇయర్ బర్డ్స్ వస్తాయి.

ఇక దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే మీరు పాటలు వినాలనుకున్నప్పుడు లేదా కాల్స్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ నుంచి వైర్లెస్ ఇయర్ బడ్స్ తీసుకుంటే చాలు.. ఇక ప్రత్యేకంగా వైర్లెస్ ఇయర్ బడ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే నోకియా 5710 ఎక్స్ప్రెస్ ఆడియో ఫీచర్ ఫోన్ ఇండియాలో అతి తక్కువ ధరకే అంటే కేవలం రూ.4,999 ధరలో రిలీజ్ అయింది. ఇక కలర్స్ విషయానికి వస్తే వైట్ రెడ్ , బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీరు కొనుగోలు చేయవచ్చు. ఇక సేల్ ప్రారంభం విషయానికి వస్తే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్ లతో పాటు ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా మీరు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు.

In built wireless ear buds
In built wireless ear buds

ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇన్ బిల్ట్ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఫోన్లో వెనకవైపు పైన వైర్లెస్ ఇయర్ బడ్స్ అందివ్వబడ్డాయి. చార్జింగ్ కేస్ కూడా మీకు అక్కడే ఉంటుంది. స్లైడర్ కిందకు జరిపి ఇయర్ బడ్స్ బయటకు తీయవచ్చు. ఇక డెడికేటెడ్ మ్యూజిక్ బటన్స్ , ఇన్ బిల్ట్ ఎంపీ 3 ప్లేయర్ తో పాటు వైర్లెస్ ఎఫ్ఎం రేడియో లాంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 4MB ర్యామ్, 128 MB స్టోరేజ్ తో సపోర్ట్ చేస్తుంది. 32GB వరకు మెమొరీ కార్డును మీరు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇకపోతే స్నేక్ టేట్రిస్, బ్లాక్ జాక్ ,నింజా అప్, ఎయిర్ స్ట్రైక్, యారో మాస్టర్ , రేసింగ్ ఎటాక్ వంటి గేమ్స్ కూడా ఆడవచ్చు.0.3 మెగాపిక్సల్ రియల్ కెమెరా కూడా ఉంటుంది.