AP Police.. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న 6100 పోలీస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పోలీస్ విభాగంలోని హోంగార్డు అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ సీహెచ్ గోపి అనే హోంగార్డుతో పాటు మరో ముగ్గురు హోం గార్డులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందరూ అభ్యర్థుల మాదిరిగానే తమకు కటాఫ్ మార్కులు విధించారని ఇది సరికాదని వారు తమ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది.
అందుకే ప్రాథమిక పరీక్షలలో అర్హత సాధించలేదంటూ తమను రెండో దశ నియామక ప్రక్రియ అయియన్ ఈవెంట్స్ కు అనుమతించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు . ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరి గా పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా దేహదారుడ్య పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, డిజిపి కి నోటీసులు జారీ చేసింది.