PRC : నూతన పీఆర్సీ అమలు.. హెచ్ఆర్ఏ శ్లాబ్స్ ఎన్నంటే..!?

PRC : ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది.. కొత్త పిఆర్సి, పే స్కేల్ ప్రకారం సవరించిన హౌస్ రెంట్ అలవెన్స్ HRA జనవరి నెల నుండి అమలు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి అమలుకు సంబంధించి సవరించిన వేతనాలు, హెచ్ఆర్ఏ లో మార్పులు, పింఛన్లను నిర్ధారిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ ఆదివారం నాలుగు జీవోలను జారీ చేశారు..!!

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. 2011 జనాభా ప్రాతిపదికన హెచ్ఆర్ఎ ను 10, 12, 16, 24 శాతం స్లాబులు గా విభజిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి గత నెల 17న జారీ చేసిన జీవోలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ భవన్ హైదరాబాదులో లో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ వస్తుందని వివరించారు. అదేవిధంగా రెండున్నర లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పే పైన 16 శాతం హెచ్ఆర్ఎ లేదంటే 17 వేలు సీలింగ్ ను ఇస్తారు.

Implementation of the new PRC HRA Slabs
Implementation of the new PRC HRA Slabs

అలాగే 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో 12 శాతం హెచ్ఆర్ఎ తో 13 వేలకు తగ్గకుండా సీలింగ్ ను ఇస్తారు. ఇక 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలలో 10 శాతం హెచ్ఆర్ఎ తో 11 వేలకు తగ్గకుండా సీలింగ్ ను ఇవ్వనున్నారు.పిఆర్సి ఉత్తర్వులతో పాటు 2022 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతన, పెన్షన్ బిల్లులను సిద్ధం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు సిటీ కంపన్సేటరీ అలవెన్స్ లను కూడా నిర్ధారిస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. పెన్షన్ చెల్లింపుల్లో 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అమలులో మార్పులు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.