ఈ చెట్లను గనుక పూజిస్తే సంపద పెరిగినట్టే..!!

ప్రకృతిలో లభించే ప్రతి మొక్క కూడా విశేషమైన విలువలను కలిగి ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల చెట్లు ఆరాధనకు యోగ్యమైనవి గా పరిగణించారు. ఇక ఈ చెట్లను పూజించడంవల్ల సంపద పెరుగుతుంది అని వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇకపోతే ఈ వృక్షాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ముందు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అంటే అందరికీ ఈ ఆర్టికల్ వాట్సాప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.

If you worship these trees, wealth will increase
If you worship these trees, wealth will increase

1. రావి చెట్టు : గాలిలో ఉండే కలుషితం ని ఫిల్టర్ చేసి 24 గంటలూ ఆక్సిజన్ ను అందిస్తూ ఉంటుంది. ఇక ఈ చెట్టు ఆరోగ్యపరంగా మంచిని చేకూర్చడమే కాదు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైనది. పితృదేవతలు రావి చెట్టు పై నివసిస్తారు అని ఈ చెట్టును ఆరాధించడం వల్ల మన ప్రార్థనలు నేరుగా పితృదేవతలకు చేరుతాయి అని చెబుతారు. ప్రతి శని వారం రావి చెట్టు పై దీపాన్ని వెలిగించడం వల్ల శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది.

2. జమ్మి చెట్టు : ఇంట్లో సంపద , శ్రేయస్సు పెరగాలి అంటే.. ప్రతి రోజు సాయంత్రం జమ్మి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇక సాయంత్రం గదిలో సంధ్యావందనం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు కింద కచ్చితంగా దీపాలు వెలిగించడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళే దిశలో బయట జమ్మి చెట్టును నాటి ఆ స్థలం ఎప్పుడూ శుభ్రంగా , చక్కగా చూసుకోవడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.

3. మనీ ప్లాంట్ : ఇంట్లో ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది . అంతే కాదు లోపలికి వెలువడిన గాలిని శుభ్రం చేసి ఆక్సిజన్ ను అందిస్తుంది. సానుకూల ప్రభావం కూడా మెరుగుపడుతుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉన్నట్లయితే సంపద కూడా పెరుగుతుందని విశ్వసిస్తారు ప్రజలు.

4. తులసి మొక్క : లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ మొక్కను ప్రతిరోజు పూజించడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. అంతేకాదు లక్ష్మీదేవి కూడా సంతృప్తి చెందుతుంది. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఏకాదశి , అమావాస్య, పౌర్ణమి రోజులలో ఆకులను తీయడం వంటివి చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత కూడా తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు.