Money Tips : డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది.. పూర్వకాలంలో పోల్చుకుంటే ఇటీవల కాలంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు. ఈ నేపథ్యంలోనే డబ్బు సంపాదించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన మార్గాన్ని ఎంచుకుంటారు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉద్యోగం సంపాదిస్తే.. మరికొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. మరికొంత మంది ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులను పొందుతున్నారు. కొంతమంది కూలిపని చేసుకుంటూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే మీరు రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టలేకపోతున్నారు.అయితే మీకు ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో రూపాయి పెట్టుబడి లేకుండానే కొన్ని వేల రూపాయలను మీరు నెలకు లాభం గా పొందవచ్చు.
అది ఎలాగంటే సోషల్ మార్కెటింగ్..సోషల్ మార్కెటింగ్ లో మనకు ఎన్నో రకాల వెబ్సైట్ లు అందుబాటులో ఉన్నాయి . ఉదాహరణకు ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ వంటి వాటి ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇక ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఇన్స్టాగ్రామ్లో ఖాతాను తెరిచి ఫాలోవర్స్ ను పెంచుకోవడమే.కొన్ని ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల ఆ కంపెనీ వారు మీకు కొంత షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రోడక్ట్ ని బట్టి కూడా కంపెనీ వాళ్లతో మాట్లాడుకోవచ్చు. అమ్మాయిలకు ఇదొక మంచి సోర్స్ అని చెప్పవచ్చు. రూపాయి పెట్టుబడి లేకుండా ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ మంచి లాభాలు పొందవచ్చు.

యూట్యూబ్ ఛానల్ : ఇక దీని గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలిసిన విషయమే. ఇక ఇందులో ఎటువంటి డబ్బులు ఇన్వెష్ట్ చేయకుండా ఫాలోవర్స్ ని పెంచుకుంటూ మంచిగా డబ్బులను సంపాదించుకోవచ్చు. ఇక మీరు ఒక ఛానల్ ను క్రియేట్ చేసి వ్యూవర్స్ ను ఆకర్షించేలా వీడియోలు పెట్టి డబ్బులను సంపాదించవచ్చు. ఇక ఏది ఏమైనా ఈ రెండింటి ద్వారా సులభంగా రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించవచ్చు.