ROSEWATER:రోజ్ వాటర్ వల్ల ఉపయోగాలు తెలిస్తే వాడకుండా అస్సలు ఉండలేరు..!

సాధారణంగా గులాబీ మనుషుల భావోద్వాగాలనీ, ఆలోచనలూ, మనసు మీద వాటి ప్రభావాన్నీ బ్యాలెన్స్ చేస్తుంది. రోజ్ ని చూడగానే శరీరానికీ, మనసుకీ కూడా ఆనందాన్ని తెలియకుండా కలగజేస్తుంది.అలాంటి రోజాపూల తో తయారు చేసే రోజ్ వాటర్ వల్ల అందానికి ఎన్నో లాభాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ముఖముపై ఇర్రిటేషన్ తగ్గిస్తుంది.
కొంతమంది కి ఎండకు వెళ్ళినప్పుడు పేస్ ఎర్రగా మారి ఇర్రిటేషన్ కలిగిస్తుంటుంది. మరి కొంతమందికి యాక్నే, ఎలర్జీల కారణంగా స్కిన్ ఎర్రగా మారుతుంటుంది. అలాంటి వారికి రోజ్ వాటర్ మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే రోజ్ వాటర్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఆ ఎర్ర దనాన్ని తగ్గించి ఈవెన్ కాంప్లెక్షన్ ని తీసుకు వస్తాయి.అలాగే ఇవి ఇన్‌ఫెక్షన్స్ ని క్యూర్ చేయడమే కాదు, ప్రివెంట్ చేస్తాయి కూడా.

2.మచ్చలను తగ్గిస్తుంది.
ఎక్కడైనా గాయమయ్యి, ఆ మచ్చలు అలా నల్లగా మారుతుంటాయి.లేదా మొటిమ తగ్గిపోయాక ఆ మచ్చలు ఉంటాయి. వీటిని తగ్గించడానికి రోజూ రెండు పూటలా రోజ్ వాటర్ ని అప్లై చేస్తే ఆ సమస్య తగ్గిపోతుంది.అంతే కాకుండా స్కిన్ డ్యామేజ్ ని తగ్గించి స్కిన్ తాజాగా ఉండేలా చేస్తుంది.ముడతలు రానివ్వదు. యూత్‌ఫుల్ గ్లో ఉండేలా చేస్తుంది.

3.టోనర్ లా యూజ్ చయండి
రోజ్ వాటర్ ని టోనర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సీబం ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా రోజ్ వాటర్ ప్రివెంట్ చేస్తుంది. డ్రై స్కిన్ ని తేమగా ఉంచుతుంది.

4.మేకప్ తొందరగా పాడవకుండా చేస్తుంది.
రోజ్ వాటర్ కేవలం స్కిన్ కేర్ రొటీన్ లో మాత్రమే కాదు, మేకప్ కిట్ లో కూడా తప్పని సరిగా ఉండవలసినదే. మేకప్ ముందు రోజ్ వాటర్ స్ప్రే చేసి మేకప్ వేసుకుంటే మేకప్ వేసి చాలా సేపైన లాంగ్ లాస్టింగా ఉంటుంది.మేకప్ ని కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది.

5.రేజర్ బర్న్ తగ్గిస్తుంది
మీ కాళ్ళ మీద కానీ, బికినీ ఏరియా లో కానీ రేజర్ వాడకం వల్ల మండుతున్నట్లు ఉంటుంది రోజ్ వాటర్ యాస్ట్రిజెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి మంటను తగ్గిస్తుంది.

6.స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది
శీతాకాలం, వేసవి కాలం అన్న తేడా లేకుండా మీ స్కిన్ ఎప్పుడూ డ్రైగానే ఉంటే రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ హైడ్రేట్గా ఉంచుతుంది.స్కిన్ పీహెచ్ స్థాయి ని బ్యాలెన్స్ చేస్తుంది.స్కిన్ మరీ ఆయిలీగానో, మరీ డ్రై గానో అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

Advertisement