Jasmine Benefits : మల్లెల పరిమళం ఆడవారికే కాదు మగవారికి కూడా చాలా ఇష్టం.. ఈ పువ్వులు వెదజల్లే పరిమళాలు మత్తును కలిగిస్తాయి.. ఈ పరిమళాల వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.. ఈ మల్లెపూల అంటే ఇష్టపడని మహిళలు అంటూ అసలు ఉండరు.. జడ లో పెట్టుకుంటే సువాసనలు వెదజల్లడం కాకుండా ఆ మహిళలకు అందాన్ని కూడా తెచ్చి పెడతాయి.. ఇకపోతే ఈ మల్లెలు అందానికే కాదు ఆరోగ్యానికీ కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.. ఇకపోతే మల్లెలు చేసే మేలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మల్లెపూల సువాసనను పీల్చినప్పుడు ఒత్తిడికి లోనైన వారు త్వరగా ఉపశమనం పొందుతారు. మల్లె పువ్వు లో యాంటీ వైరల్.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడంవల్ల సుఖవంతమైన నిద్రకు ఇవి ఉపకరిస్తాయి.. కేశాలు ఒత్తుగా పెరగడానికి కూడా మల్లెపూలు ఎంతగానో సహాయపడతాయి. ఇందుకోసం కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి .. ఆ తర్వాత ఈ నూనెను మరగబెట్టి తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మాడుకు చల్లదనాన్ని అందిస్తుంది.. అంతేకాదు ఈ నూనె చర్మానికి కూడా చక్కటి తేమను అందిస్తుంది.

ఈ మల్లె పువ్వుల లో విటమిన్ సి ఉండడంవల్ల పలు ఔషధాలను లో వీటిని ఉపయోగిస్తున్నారు.. పూలతో తయారు చేసిన మాస్కులు ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి అంటే.. మల్లెపువ్వు లను పేస్ట్ చేసి కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలి.. ఆ తర్వాత గంధం, ముల్తానామట్టి , తేనె కలిపి ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.ఇక ముఖ్యంగా మల్లె పూలతో తయారు చేసుకునే టీ తాగడం వలన రక్తపోటు తగ్గుతుంది..రోగనిరోధక శక్తి పెరిగి వృద్ధాప్య లక్షణాలు దూరమవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.