Mobile : మీ మొబైల్ స్క్రీన్ లాక్ మర్చిపోయారా? అయితే ఈ చిన్న ట్రిక్ ఉపయోగించండి..!!

Mobile : ప్రతిరోజు మనం ఉపయోగించే స్మార్ట్ మొబైల్ కు కచ్చితంగా స్క్రీన్ లాక్ అనేది పెడతాము. అయితే ఈ స్క్రీన్ లాక్ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాస్వర్డ్ లేదా పాట్రన్ లేదా ఫింగర్ ప్రింట్ వంటి స్క్రీన్ లాక్స్ పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇవి ఎవరి అనుకూలతను బట్టి ఆ విధంగా వారు స్క్రీన్ లాక్ సెట్ చేసుకోవడం జరుగుతుంది. నిజానికి మనం స్క్రీన్ లాక్ తప్పనిసరిగా పెట్టాలి.. లేకపోతే ఇతరులు మన మొబైల్ ను తీసుకొని వ్యక్తిగత విషయాలను దోపిడీ చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఒకవేళ మనం మర్చిపోయి ఎక్కడైనా మన ఫోన్ ని పోగొట్టుకున్నట్లయితే ఇతరులు మన ఫోన్ తీసుకొని వెంటనే స్విచ్ ఆఫ్ చేసేస్తారు.. కానీ స్క్రీన్ లాక్ ఉన్నప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం కుదరదు. అప్పుడు సమయం పడుతుంది.. కాబట్టి వెంటనే మనం మన స్మార్ట్ ఫోన్ ను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా మొబైల్ ను తీసుకున్నప్పుడు స్క్రీన్ లాక్ ఉండడం వల్ల వాళ్లు మన ఫోన్ యాక్సిస్ చేయడం కష్టమవుతుంది.

దాంతో మనకు తెలిసిన వాళ్ళు మన మొబైల్ తీసుకున్నట్లయితే వాళ్లే తిరిగి మన వద్దకు వచ్చి లాక్ ఓపెన్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని సందర్భాలలో మొబైల్ కి పెట్టుకున్న స్క్రీన్ లాక్ పాస్వర్డ్ లేదా పాటర్న్ మర్చిపోతూ ఉంటాము. అలాంటి సందర్భాలలో ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు.అయితే సర్వీస్ సెంటర్లకు వెళితే వాళ్లు ఎక్కువ డబ్బు అడుగుతారు. ఇకపై మీరు సర్వీస్ సెంటర్ కు వెళ్లకుండా చిన్న సింపుల్ ట్రిక్ పాటించి మొబైల్ లాక్ ఈజీగా అన్లాక్ చేయవచ్చు. ముందుగా కంప్యూటర్లో వండర్సెర్స్ ఆండ్రాయిడ్ పాట్రన్ లాక్ రిమూవ్ అని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అక్కడ చూపించే సూచనలు మేరకు మీరు ఫాలో అవుతూ మన మొబైల్ లాక్ రిమూవ్ చేసుకోవచ్చు.

If you forgot your mobile screen lock then this little trick
If you forgot your mobile screen lock then this little trick

మరొక పద్ధతి ఏమిటంటే.. మొబైల్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా కూడా మీరు మొబైల్ అన్లాక్ చేయవచ్చు. ఇక ఫ్యాక్టరీ రీసెట్ కోసం ముందుగా మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత పవర్ బటన్ అలాగే వాల్యూ అప్ బటన్ లేదా డౌన్ బటన్ ఏదో ఒకటి.. రెండూ ఒకేసారి ప్రెస్ చేసి అలాగే ఉంచాలి. అప్పుడు ఫ్యాక్టరీ మోడ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎరేజ్ డేటా అనే ఆప్షన్ ఎంచుకోవాలి
టచ్ వర్క్ చేయదు కాబట్టి వాల్యూమ్ బటన్స్ సహాయంతో మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.. ఇక ఎరైజ్ మొబైల్ ఆల్ డేటా కన్ఫర్మ్ అని అడుగుతుంది.. దాన్ని ఓకే చేయడం ద్వారా మొబైల్లో ఉండే డేటా మొత్తం క్లియర్ అయ్యి మొబైల్ స్టార్టింగ్ లో ఉన్నట్లు ఆన్ అవుతుంది. నిజానికి స్క్రీన్ లాక్ మర్చిపోయినప్పుడు మీరు ఇలా మొబైల్ డేటా కోల్పోక తప్పదు. అయితే ఎందుకైనా మంచిది సాధ్యమైనంతవరకు మొబైల్ లాక్ స్క్రీన్ మర్చిపోవద్దు