Mobile : సాధారణంగా ఇటీవల కాలంలో చాలావరకు మోసపూరిత కాల్స్, మెసేజ్లు ఎక్కువయ్యాయి. ఇక చాలామందికి వీటిపై అవగాహన లేక వ్యక్తిగత విషయాలు చోరీ చేయబడుతున్నాయి. అంతేకాదు నగదు చోరీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉండడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లో చాలామంది ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాల వివరాలు , యూజర్ నేమ్, పాస్వర్డ్, పేమెంట్ వివరాలు ఇలా అన్నీ కూడా ఫోన్లోనే స్టోర్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇక చాలావరకు అన్ని పేమెంట్స్ కూడా గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ తోపాటు అన్ని పేమెంట్ యాప్స్ ద్వారా పే చేస్తున్నారు. అయితే కొంతమంది సైబర్ క్రిమినల్స్ ఇదే అదునుగా చూసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోని స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లతో మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు.. ఒకవేళ అవి నమ్మి.. వారు చెప్పినట్టు చేస్తే ఇక మన విలువైన వ్యక్తిగత సమాచారంతోపాటు డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మోసపూరిత స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్ లు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే..లింక్, టెక్స్ట్, ఆన్లైన్ పేమెంట్, యాప్ ఇలా ఏ విధానంలో అయినా సరే మీ మొబైల్ కు స్పామ్ కాలర్ పేమెంట్ రిక్వెస్ట్ పంపితే అసలు యాక్సెప్ట్ చేయకూడదు. స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు పేమెంట్ చేయాలనీ అడిగితే వాటిని పట్టించుకోవద్దు. ఇక ఏదైనా లింకు షేర్ చేసినప్పుడు దానిపై క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా కాల్ లోనే ఉండి పేమెంట్ చేయాలి అని అడిగితే అసలు అంగీకరించవద్దు.
అంతేకాదు కాల్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయవద్దు. ఎందుకంటే మాల్వేర్ తో కూడిన ఆ యాప్ ను యూజర్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని తొందర పెడుతుంటారు. అలాంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో అయినా సరే కాల్ లో ఉన్న సమయంలో యాప్ ను కానీ , ఫైల్స్ ని కానీ మీ స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోకూడదు. అంతేకాదు స్క్రీన్ కూడా షేర్ చేయవద్దు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని , స్క్రీన్ షేర్ చేసి.. బ్యాంకింగ్ యూజర్ నేమ్ , పాస్వర్డ్ మొబైల్ లో ఎంటర్ చేయాలని కోరుతారు. ఇలా అడిగినప్పుడు వెంటనే మీరు అప్రమత్తమై ఫోన్ కట్ చేస్తే మంచిది. అంతేకాదు మీకు తెలియని వ్యక్తులకు ఎటువంటి సమాచారాన్ని కూడా అందించకూడదు. అలాగే యూపీఐపి ను యూపీఐ ఐడి, బ్యాంకు కార్డు వివరాలు అడిగినప్పుడు కూడా ఎవరికీ చెప్పవద్దు.