Google Assistant Voice : స్మార్ట్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ వచ్చిన తర్వాత మనకు వెతుక్కోవడం చాలా తేలిక అవుతుంది . ఇలా బటన్ నొక్కి అలా చెప్పగానే మనకు కావాల్సిన సమాచారాన్ని అందివ్వడానికి సిద్ధంగా ఉంటుంది గూగుల్ . ముఖ్యంగా గూగుల్ వర్చువల్ అసిస్టెంట్ అనేది స్మార్ట్ ఫోన్ లో ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన ఫీచర్ అని చెప్పవచ్చు. సాధారణంగా గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ ను ఒకే వాయిస్ స్టైల్ లో మనం వింటూ ఉంటాము. అయితే ఓకే వాయిస్ విని విని బోర్ కొడుతుంటే .. దాన్ని మీరు మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడే వారి కోసం గూగుల్ పది వాయిస్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఆరు ఆడ, నాలుగు మగ వాయిస్ లు ఉన్నాయి. ఇక మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ , ఆపిల్ ఫోన్ , మీ స్మార్ట్ డిస్ప్లే లో గూగుల్ వాయిస్ ఎలా మార్చాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ను ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ని యాక్టివేట్ చేయాలి. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లో ముందుగా హే గూగుల్ అని చెప్పడం లేదా గూగుల్ అసిస్టెంట్ బటన్ ని క్లిక్ చేయడం చేయాలి. ఇప్పుడు చేంజ్ యువర్ వాయిస్ అని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై కనిపించే మేనేజ్ వాయిస్ సెట్టింగ్ బటన్ క్లిక్ చేయాలి. మీకు కావాల్సిన వాయిస్ కోసం వాయిస్ రీసెట్ ద్వారా స్క్రోల్ చేసి మీకు నచ్చిన వాయిస్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఓకే గూగుల్ అని చెప్పిన ప్రతిసారి సరికొత్త వాయిస్ లభిస్తుంది. ఇక గూగుల్ యాప్స్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ను ఎలా మార్చాలి అంటే.. ముందుగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో గూగుల్ యాప్ ను తెరవండి. కుడి వైపు ఎగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ గుర్తుపై క్లిక్ చేసి , సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ను ఎంచుకున్న తర్వాత అన్ని సెట్టింగ్స్ విభాగంలో అసిస్టెంట్ వాయిస్ మరియు సౌండ్స్ ఎంపిక చేసుకోవాలి. ఇక మీకు నచ్చిన వాయిస్ ను ఎంచుకుంటే సరిపోతుంది. ఇక ఐఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ను ఎలా మార్చాలి అంటే.. ఐఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యాప్ ను ఓపెన్ చేసి కుడివైపు ఎగువ మూలన మీ ప్రొఫైల్ గుర్తును ఎంచుకోవాలి. ఇక అసిస్టెంట్ వాయిస్ పై క్లిక్ చేసి మీకు కావాల్సిన వాయిస్ ని ఎంచుకోవచ్చు. ఇక స్మార్ట్ డిస్ప్లేలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఎలా మార్చాలి అంటే .. గూగుల్ స్మార్ట్ డిస్ప్లేలో గూగుల్ హోమ్ యాప్ ని ఓపెన్ చేయాలి. డిస్ప్లే కుడివైపు ఎగువ మూలలో మీ ప్రొఫైల్ ఫోటోను క్లిక్ చేసి ఆ తర్వాత అసిస్టెంట్ సెట్టింగ్స్ ఎంపికపై క్లిక్ చేయండి. ఆల్ సెట్టింగ్స్ విభాగంలో అసిస్టెంట్ వాయిస్ ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వాయిస్ ని ఎంచుకోవచ్చు.