Mobile : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైన వస్తువుగా మారిపోయింది. ముఖ్యంగా అది ప్రీమియం ఫోనా లేక బడ్జెట్ ఫోనా అనే విషయం పక్కన పెడితే.. ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ తప్పనిసరి అయిపోయింది. ఇకపోతే ప్రతి ఒక్కరు కూడా తమ స్మార్ట్ఫోన్ భద్రత విషయంలో తొలి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.. లేకపోతే అది పాడవడమే కాదు అనవసరంగా వృధా ఖర్చు కూడా.. అసలే వర్షాకాలం ఈ మధ్యకాలంలో వర్షాలు మరదలుగా పొంగిపొర్లుతున్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలోని మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో పాటు స్మార్ట్ ఫోన్ కూడా అత్యంత భద్రంగా దాచుకోవాలి .
లేకపోతే వానకు తడిచినా..వాటర్ లో పడినా . ఇక మీ ఫోన్ పని గోవిందా! అందుకే నీటి దగ్గర సెల్ ఫోను ను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ మరికొంతమంది సాధారణ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేసిన తర్వాత మరో కొత్త ఫోన్ కొనుగోలు చేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. అలాంటివారి కోసమే మార్కెట్లో ఒక పరిష్కారం అందుబాటులో ఉంది. ఈ మధ్యకాలంలో ఆపిల్, సాంసంగ్ వంటి తాజాగా విడుదలైన ప్రీమియం డివైస్లు వాటర్ ప్రూఫ్ కలిగి ఉన్నాయి.
ఇక అయినప్పటికీ కూడా వాటికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆకస్మిక వర్షం నుండి ఫోను రక్షించే మార్గం కోసం ప్రజలు వెతుకుతున్న నేపథ్యంలో ఈ సమస్యలను తగ్గించడానికి వాటర్ ప్రూఫ్ కవర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం వీటి ధర కేవలం రూ.300 లోపే.. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచ్ చాలా సరసమైన దొరికే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇక సాధారణ పౌచులా కనిపించే ఈ పౌచ్ మీ ఫోను నీటి నుండి రక్షించగలదు. ఇక ఈ కవర్లో ఒక సెల్ ఫోన్ మాత్రమే కాదు విలువైన పత్రాలు, డబ్బులు కూడా దాచుకోవచ్చు. ఇక ఇలాంటిది ఒకటి మీ దగ్గర ఉంటే ఇక మీ స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ అయినట్టే. తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అన్నమాట.