ఆగస్టు 16 శ్రావణ అమావాస్యనాడు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ దరిద్రం వదులుతుంది..

2023, ఆగస్టు 16 అత్యంత శుభప్రదమైన దినమని, ఆరోజు అధిక శ్రావణ అమావాస్య అని పండితులు చెబుతున్నారు. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుత అమావాస్య అని అంటున్నారు. దీనికి ఎంతో విశిష్టత ఉందని కూడా చెబుతారు. అలానే ఈరోజు ఉప్పుతో ఒక పని చేస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడని విశ్వసిస్తారు. నేడు ఉప్పుతో ఆ పని చేస్తే కెరీర్ పరంగా కూడా చాలా సక్సెస్ అవుతారట. ఆర్థికంగా బాగా బలపడతారట. మరి ఉప్పుతో పరిహారం ఎలా చేయాలో, ఆర్థికంగా ఎలా పురోగతి సాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటగా ఒక మట్టి లేదా గాజు పాత్రను తీసుకోవాలి. తర్వాత రాళ్ల ఉప్పు తీసుకోవాలి. ఇది నిత్యం మనం వాడే ఉప్పుకు భిన్నంగా ఉంటుంది. పాత్రలో రాళ్ల ఉప్పు పోసిన తర్వాత దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ చిలకరించాలి. తర్వాత ఆ పాత్రను పట్టుకొని ప్రతి గదికి, ప్రతి మూలకి తీసుకువెళ్లాలి. ఆ సమయంలో బయట వ్యక్తులు ఎవరూ కూడా మీ ఇంట్లో ఉండకూడదు. ఈ పరిహారాన్ని ఇంటికి దిష్టి తీయడం అంటారు. సాధారణంగా మనుషులకు ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేటప్పుడు బయట వ్యక్తులు ఎవరూ ఉండకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఇంటికి దిష్టి తీసేటప్పుడు కూడా ఇంట్లో బయట వ్యక్తులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.

 

ఇంటిలోని నలుమూలలకు ఈ పాత్రను తీసుకువెళ్లిన తర్వాత దానిని చిన్నపిల్లలు తొక్కని లేదా తిరగని ప్లేస్ లో ఎనిమిది గంటల పాటు ఉంచాలి. ఇలా చేసినట్లయితే నరదిష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఈ శక్తులను ఉప్పు, పసుపు, కుంకుమ ఇవన్నీ పీల్చుకుంటాయి. 8 గంటలపాటు ఈ పాత్రను ఇంట్లో ఉంచిన తర్వాత దానిని తీసుకువెళ్లి ఒక వాటర్ సింక్‌లో పడేయాలి. ఆ సమయంలో వాటర్ ట్యాప్ నుంచి ధారగా నీరు కారుతూ ఉండాలి. అలా కారుతున్న నీరు వల్ల ఉప్పు కరిగిపోయి సింక్ హోల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఉప్పు కరిగిపోయి వెళ్లిపోయినట్లే ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి అనేది తొలగిపోతుంది.