SmartPhone : స్మార్ట్ ఫోన్ లో మీరు ఇలా చేశారంటే ఇకపై హ్యాకర్లకు చెక్..!

SmartPhone : సాధారణంగా ఈ మధ్యకాలంలో హ్యాకర్ల బెడద ఎక్కువైంది అని చెప్పాలి. వీరి నుంచి బయటపడడానికి ఎంతో మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒకచోట అయితే మాత్రం డబ్బులను కోల్పోవడం లేదా వ్యక్తిగత విషయాలను దోపిడీ చేయబడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ పొందిన ఆపరేటింగ్ సిస్టంగా ఆండ్రాయిడ్ నిలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగదారులు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నారు. ఇక ఈ ఆపరేటింగ్ సిస్టం ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ పైన ఆధారపడి ఉంటుంది.కాబట్టి వివిధ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లలో కొద్దిగా భిన్నమైన ఆండ్రాయిడ్ వెర్షన్లను ఉపయోగించడం జరుగుతుంది. ఇక ఈ ఓపెన్ సోర్స్ అనేది చాలా సాధారణం.. అయితే దీనివల్ల డివైస్ హానికరమైన సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది.

కాబట్టి కస్టమర్లు తమ ఫోన్లను సురక్షితంగా ఉంచుకోవడానికి గూగుల్ వివిధ రకాల భద్రతా ప్రమాణాలను కూడా పాటిస్తుంది. ఇక అందులో భాగంగానే ఎన్ని సెక్యూరిటీ మేజర్స్ ప్రవేశపెట్టినా.. వివిధ భద్రత చర్యలపై గట్టి పట్టు ఉన్నా.. కొన్నిసార్లు కొన్ని హానికరమైన సైబర్ దాడులను ఆపడం అసాధ్యమని చెప్పాలి. అందుకే ఇలాంటి వాటికి Google Play protect అని సెక్యూరిటీ సెట్టింగ్ ను ఆన్ లో ఉంచాలని ఆండ్రాయిడ్ యూసర్లకు గూగుల్ సలహా ఇస్తోంది. ఇక ఈ Google Play protect అనేది గూగుల్ అందించే ఫ్రీ సెక్యూరిటీ సర్వీస్ అని చెప్పవచ్చు. ముందుగా కస్టమర్లు ఏవైనా యాప్లను ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా డౌన్లోడ్ చేసినప్పుడు వాటిని ఇది తనిఖీ చేస్తుంది. ఇక మీరు ఏదైనా యాప్లను లేదా మరి వేటినైనా డౌన్లోడ్ చేయడానికి ముందే గూగుల్ ప్లే స్టోర్ యా పై సెక్యూరిటీ చెక్ రన్ చేస్తుంది. ఇక డివైస్ లో ఇతర సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ప్రమాదకరమైన యాప్స్ ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేస్తుంది.

If you do this on a SmartPhone it is no longer a check for hackers
If you do this on a SmartPhone it is no longer a check for hackers

మీరు Improve harmful app detection సెట్టింగ్ ఆన్ చేస్తే.. అన్ నోన్ యాప్స్ ను గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆటోమెటిగ్గా గూగుల్ కు సెండ్ చేస్తుంది. ప్రమాదకరమైన యాప్స్ ను గుర్తించి కస్టమర్లను కూడా హెచ్చరిస్తుంది. ఇందుకోసం మీరు ఎలా చేయాలి అంటే ..ఆండ్రాయిడ్ డివైస్ లలో Google Play protect సెట్టింగ్ ను డిఫాల్ట్ గా ఆన్ చేసి ఉంటుంది. అయితే అనుకోకుండా ఈ సెట్టింగ్ ను ఆఫ్ చేసి ఉంటే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యే ఆన్ చేయవచ్చు. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్ లో ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ కి వెళ్లి..అక్కడ కనిపించే Improve harmful app detection సెట్టింగ్ ఆన్ చేయండి. ఇలా చేస్తే ఏదైనా హానికరమైన యాప్ ఉంటే వెంటనే గుర్తించి మీకు నోటిఫికేషన్ పంపుతుంది.