Flipkart Smart Tv Offers : ఇలా చేస్తే రూ.1000 కే స్మార్ట్ టీవీ .. త్వరపడండి..!

Flipkart Smart Tv Offers : స్మార్ట్ టీవీ లపై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరొకసారి ఆఫర్స్ తీసుకొచ్చింది . డిస్కౌంట్ ధరలకే స్మార్ట్ టీవీలను అందిస్తూ మరింతగా కస్టమర్లను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీ లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. రియల్ మీ బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన నియో స్మార్ట్ టీవీ నీ ఎక్స్చేంజ్ ఆఫర్ లో 1000 రూపాయలకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. మరి ఈ టీవీ పూర్తి వివరాలు, ఆఫర్ యొక్క వివరాలు అన్నీ తెలుసుకుందాం.

Advertisement
If you do this.. get smart TV at only Rs.1000..!
If you do this.. get smart TV at only Rs.1000..!

ప్రస్తుతం రియల్ మీ లాంచ్ చేసిన నియో 32 అంగుళాలు స్మార్ట్ టీవీ ప్రస్తుతం రూ.11,999 ధరకు లిస్ట్ అయ్యింది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫెడరల్ బ్యాంకు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు , పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ , యాక్సిస్ బ్యాంకు , క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఈఎంఐ ఆఫర్ ద్వారా రూ. 416 నుంచి ప్రారంభం అవుతుంది. రియల్ మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి అద్భుతమైన ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

మీ పాత టీవీ ఎక్స్చేంజ్ చేస్తే రూ.10,975 వరకు డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. అయితే మీ పాత టీవీ కి రూ.10, 975 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తే మీరు కేవలం ₹1000 చెల్లించి ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ డిస్కౌంట్ తక్కువ లభిస్తే.. మిగతా మొత్తం చెల్లించి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 60 Hz ఎల్ఈడి డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీ పిక్చర్ క్వాలిటీ పెంచుకునేందుకు క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ సపోర్ట్ ను కూడా పొందుపరిచారు. ఇందులో 512 MB ర్యామ్ 4GB స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

Advertisement