Vastu Tips : వాస్తు ప్రకారం ఇలా చేశారంటే మీ సంపద రెట్టింపవడం ఖాయం..!

Vastu Tips : మత సాంప్రదాయాల ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఇంటిని నిర్మించేటప్పుడు అలాగే ఆ ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకోవడం గమనార్హం. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మనం మన ఇంటిని నిర్మించుకోకపోతే ఇంట్లో కలహాలు.. ఏది కలిసి రాకపోవడం.. ఆర్థిక ఇబ్బందులు.. దంపతుల మధ్య సమస్యలు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందే ఆచితూచి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. ఇకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మరి అవేంటో ఇప్పుడు ఒకసారి మనం చదువు తెలుసుకుందాం..

Advertisement

ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఇక వారు పడుకునే మంచం కింద కుండలో నీటిని నింపి, ఆ నీటిలో కొద్దిగా పటిక వేసి పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో శాంతి నెలకొనడమే కాకుండా కుటుంబ కలహాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు పటికను ఎప్పుడు మీ ఇంట్లో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా ఎప్పుడూ మీపై ఉంటుంది. ఇక కుటుంబంలో ఆనందం, శాంతి కలుగుతాయి.పటిక అనేది ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిపాటి పటికను తినడం వల్ల రోగాలు కూడా దూరం అవుతాయి. ఇక పటికను ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. వ్యాపారంలో పురోగతి , లాభం చేకూరాలన్నా.. విద్యార్థులకు సంబంధించి పురోగతి సాధించాలన్నా ఎర్రటిగుడ్డలో కొద్దిగా పటికను చుట్టి ఆ వస్త్రాన్ని ఇంట్లో ఒక మూలన ఉంచినట్లయితే సమస్యలన్నీ దూరం అవుతాయి.

Advertisement
If you do this according to Vastu Tips, your wealth is surely to double
If you do this according to Vastu Tips, your wealth is surely to double

ముఖ్యంగా విద్యార్థుల చదువు కూడా మెరుగుపడుతుంది. ఇక ప్రతి ఇంట్లో రోజు గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఒక గిన్నెలో పటిక వేసి ఒక మూలన ఉంచినట్లయితే కుటుంబ కలహాలు తొలగిపోతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇక వాస్తు దోషం కూడా మీ ఇంట్లో ఉన్నట్లు మీకు తెలిస్తే ముందుగా ఒక గిన్నెలోకి 50 గ్రాముల పటిక తీసుకొని.. ఆ గిన్నెను ఆ ఇంటి పూజ గదిలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా పటిక తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఖర్చు కూడా తగ్గుతుంది .ఇక లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉంటుంది.

Advertisement