ఈ రాశుల వారు ఈ 43 రోజులు జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు…

2023, జులై 24 నుంచి శుక్ర గ్రహం వక్రగతి పట్టింది. ఈ గ్రహం వక్రగతిలోనే సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఉండనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సమయంలో ఏడు రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ రాశుల వారు సెప్టెంబర్ 4 వరకు అంటే దాదాపు 43 రోజుల కాలం వరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారికి జీవితంలో పెద్ద ఎదురు దెబ్బలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

• మేషరాశి:

మేషరాశి వారికి ఈ సమయంలో కుటుంబ వివాదాలు జరిగే అవకాశం ఉంది. వారి తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఉద్యోగం కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా పని చేసుకోవాలి.

• కన్యారాశి:

ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ. అధిక ఖర్చులు కూడా పెట్టకుండా జాగ్రత్త పడాలి. పని ఒత్తిడి పెరిగి, విశ్రాంతి తక్కువ లభించే అవకాశం ఉంది. శనివారం హనుమాన్ చాలీసా చదవడం చాలా అవసరం.

• వృచ్చిక రాశి:

తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఎక్కువ. కుటుంబాల్లో కలహాల ముప్పు ఉంది. అనవసరంగా ఖర్చులు పెట్టకూడదు.

• ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారి పనికి ఆటంకం కలుగుతుంది. ఈ కాలంలో ఒత్తిడి రెట్టింపు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి, సరస్వతి దేవిని ఆరాధించాలి.

• మకర రాశి:

సెప్టెంబర్ నాలుగు వరకు మకర రాశి వారు గొడ్డు చాకిరీ చేయాల్సిన పరిస్థితిని వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. కావున జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బిజినెస్, పెట్టుబడుల్లో నష్టాలు చవిచూసే ప్రమాదమూ పొంచి ఉంది. కాబట్టి పెట్టుబడులకు దూరంగా ఉంటూ బిజినెస్ లు జాగ్రత్తగా చూసుకోవడం అవసరం.

• కుంభరాశి:

వ్యాపారంలో పెద్ద నష్టం, కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. పై అధికారులతో గొడవలు పెట్టుకోకూడదు.

• మీన రాశి:

మీన రాశి వారికి ఈ కాలంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంటే కాబట్టి రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.