Hair Benefits : ఎవరికైనా సరే జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలని అనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి వారు తీసుకునే ఆహారాన్ని బట్టి ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జుట్టు ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అతి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్ల పడిపోవడం, పొడిబారిపోయి నట్టు నిర్జీవంగా అనిపించడం ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇకపోతే జుట్టు సహజంగా ఇంట్లో దొరికే పదార్థాలతో ఒత్తుగా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మసాజ్ : వారానికి రెండు సార్లయినా సరే జుట్టుకు గోరువెచ్చని నూనెను అప్లై చేసి సుతిమెత్తగా వృత్తాకారంలో మునివేళ్ళతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారు కూడా జుట్టుకు ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అంతే కాదు ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి ఈ మసాజ్ అనే పద్ధతి చాలా ఉత్తమమైనది.

ఉల్లి రసం : ఉల్లి రసం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది అని అందరికి తెలిసిందే. అయితే ఈ ఉల్లి రసాన్ని జుట్టు మొదల్లో పట్టించి సుతిమెత్తగా మసాజ్ చేయాలి. ఉల్లి లో ఉండే రసాయనాలు జుట్టు పెరుగుదలకు సహాయపడడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా తోడ్పడతాయి. ఇక ఈ ఉల్లి రసాన్ని జుట్టు మాడుకు పట్టించి పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు పెరుగుదలను గమనించవచ్చు. అయితే వారానికి ఒకసారి ఈ చిట్కాను కంపల్సరిగా వాడాల్సి ఉంటుంది.
కొబ్బరి నూనె : కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు తగినంత తేమ అంది , ఆరోగ్యంగా పెరుగుతుంది. నిర్జీవంగా మారిన జుట్టుకు కొబ్బరి నూనె ఎంతో మేలు చేస్తుంది. ఇక వీటితో పాటు రోజ్మెరీ ఆయిల్, కలబంద వంటి వాటిని ఉపయోగించి కూడా జుట్టు పెరుగుదలను పెంపొందించుకోవచ్చు.