Morphing : కాలేజీ అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసింది వీడే..!

Morphing : తాజాగా కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఘట్ కేసర్ లోని విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూషన్ కాలేజి లో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినీల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేసి ఒక్కొక్కరిగా వారిని గ్రూపులో యాడ్ చేస్తున్నారు.. ఈ వేధింపులు భరించలేని విద్యార్థులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి తిరిగు దారిలో వెళ్తుండగా తనపై కంప్లైంట్ ఇస్తారా? అంటూ మీ ఫొటోలు నెట్లో పెడతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad VBIT college Girls photos Morphing Pradeep arrested in Vijayawada
Hyderabad VBIT college Girls photos Morphing Pradeep arrested in Vijayawada

హైదరాబాదు శివారు ఘట్ కేసర్ లోని కాలేజీల అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసిన ఘటనలో పోలీసులు నిందితుడు ప్రదీప్ ను అరెస్టు చేశారు. అతడిని విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు నిందితులు ఉన్నారో తెలుసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని విద్యార్థులు తోపాటు వారి తల్లిదండ్రులు కూడా పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.