Wife Twist : ఒరిస్సాను ఓ కేసు ఆతలాకుతలం చేస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలోని బిజెపి మంత్రులు సైతం ఓ యువకుడు మరణం వెనుక కారణమేంటో బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతలా యువకుడి మరణం సెన్సేషనల్ గా ఎందుకు మారిందో.? అనేది చూద్దాం… భువనేశ్వర్లు ఆదిత్య దాస్ అనే సామాజిక కార్యకర్త చాలా పాపులర్.అతనికి వేలాది మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉన్నారు. మంచికార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరును సంపాదించాడు.ఆడపిల్లల నుంచి అడుక్కునే వారికి కూడా సాయం చేస్తాడు ఆదిత్య.
భువనేశ్వర్ లో ఒక వృద్ధాశ్రమాన్ని కూడా ప్రారంభించాడు. దాని పేరు మనం ప్రేమి. దానికి ఎన్నో విరాళాలు కూడా వచ్చాయి. ఇతనికి వైద్య శ్రీ అనే మహిళతో జూన్ 2020 నా ఘనంగా పెళ్లి జరిగింది. ఇద్దరు కూడా మొదటి రెండు వరాల్లో అన్యోన్యంగా ఉన్నట్టే కనిపించారు.కానీ వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వచ్చాయి. జులై 7న భార్య వైద్యశ్రీతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు.అలిగి వెళ్ళాడు లే మరి వస్తాడు అని వైద్యశ్రీ భావించింది. ఫోన్ చేసిన ఎటువంటి స్పందన లేదు. ఈ విషయం ఇంట్లో వారికి కూడా చెప్పింది.ఆ తర్వాత మూడు గంటల తర్వాత రైల్వే ట్రాక్ మీద అతని మృతదేహం. ఈ విషయాన్ని పోలీసులు వచ్చి చెప్పడంలో వైద్యశ్రీ కుప్ప కూలింది.
ఆదిత్య డైరీలో నా చావుకు ఎవరు కారణం కాదని రాసి తన సంతకాన్ని చేశాడు. భార్య మీద పోలీసులకు అనుమానం వచ్చింది. ఒకవైపు విచారణ చేస్తుండగా వైద్య శ్రీ కి కూడా తెలియని ఒక సమాచారాన్ని బయటపెట్టారు ఆదిత్య తల్లిదండ్రులు. ఒక సైకో లేడీ తన కుమారుడు మరణానికి కారణం అని కేసు పెట్టారు.నా కొడుకుని ఇష్టపడింది,పెళ్లి చేసుకుంటానని వెంటపడింది, భువనేశ్వర్ వచ్చి ఆదిత్య చుట్టూ తిరిగింది.ఆదిత్య ఆమెను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో చంపించి ఉంటుందని కేస్ కి కొత్త టర్న్ ఇచ్చారు. ఆదిత్య తల్లిదండ్రులు.దీంతో చిన్మైని పోలీసులు విచారణకు పిలిచారు.ఫేస్బుక్ ద్వారా ఆదిత్య పరిచయమని చెప్పింది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ నేనెందుకు అలా చేస్తాను అని చెప్పింది చిన్మాయ్…అయితే ఎవరు చంపారు..? చంపాల్సిన అవసరం ఏముంది..? తేల్చలేక తన కేసు మధ్యలోనే నిలిచిపోయింది.