Mobile : మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే త్వరపడండి లేకపోతే ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మొబైల్ డిస్ప్లేకు అనుసంధానం చేసే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీలు దిగుమతులపై 15 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ప్రకటించింది. ఇక ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారుల పైన మోపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కనుక జరిగితే స్మార్ట్ ఫోన్లు ధరలు కూడా పెరగబోతున్నాయి ముఖ్యంగా చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం చైనా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే వాటి ధరలు పెరుగుతున్నందున స్మార్ట్ మొబైల్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లో డిస్ప్లే పై కేంద్ర ప్రభుత్వం 10% కష్టం సుంకం విధిస్తోంది. ఇక డిస్ప్లే అసెంబ్లీ తయారీలో వినియోగించే భాగాలపై సుంకం ఏమి విధించడం లేదట. కానీ స్పీకర్ నెట్ , పవర్ కీ, స్లైడర్ స్విచ్, బ్యాటరీ భాగం, ఫింగర్ ప్రింట్ కు ఉపయోగపడే ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్ లు, డిస్ప్లే తో వచ్చినా విడిగా దిగుమతి చేసుకున్నా సరే 15% దిగుమతి సుంకం చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. ఇక చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు ఒప్పో, వివో ఇటీవల పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అయితే మొబైల్ భాగాలకు సంబంధించిన కస్టమ్ నిబంధనల పట్ల స్పష్టత లేకపోవడం వల్లే పొరపాటు జరిగిందని కూడా పేర్కొన్నాయి.
దీంతో సుంకం ఎగవేతలను నివారించడానికి ఈ స్పష్టత ఇస్తున్నట్లు సిబిఐసి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీల వారు 15% పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొనింది. ముఖ్యంగా మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఆ భారాన్ని వారు మోయకుండా వినియోగదారులపై మోపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే మరి కొద్ది రోజుల్లో కచ్చితంగా మొబైల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తూ మొబైల్ కొనాలనుకునే వారు ఇప్పుడే కొంచెం తొందరగా కొనుగోలు చేస్తే సరిపోతుంది. లేకపోతే ధరలు పెరిగి డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా ఇప్పుడు ఉన్న అధునాతన స్మార్ట్ ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తే మంచిది.