Flipkart Sales : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ తాజాగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులపై అలాగే ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అంతేకాదు మరెన్నో వస్తువులను సగం కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి కష్టమర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపోతే ఫ్లిప్కార్ట్ లో డెడ్ చీప్ ధరకే అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి తెలుసుకుందాం..
షియోమీ MI 5A హెచ్ డి ఎల్ ఈ డి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : 32 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లో రూ.24,999 కే లభిస్తుంది. కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని మీరు కేవలం రూ.9000 డిస్కౌంట్తో రూ.15,499 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 11 వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఇలా చూసుకుంటే మీరు కేవలం ఈ స్మార్ట్ టీవీ ని రూ.3749 కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S 7 ప్లస్ : 6GB ర్యామ్ , 128 GB స్టోరేజ్ కలిగిన ఈ ట్యాబ్ అసలు ధర రూ.76,999. ఫ్లిప్కార్ట్ లో 35% డిస్కౌంట్తో రూ.49,999 అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 భారీ తగ్గింపుతో కేవలం రూ.26,499 కే సొంతం చేసుకోవచ్చు.
Fire -Boltt Almighty Smart watch : బ్లూటూత్ కాలింగ్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉన్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.14,999.. కానీ ఫ్లిప్కార్ట్ లో 66% డిస్కౌంట్తో రూ.4,999 కే కొనుగోలు చేయవచ్చు.
రెడ్మీ నోట్ 10 ప్రో : ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999 కాదా ఫ్లిప్కార్ట్ లో 20 శాతం డిస్కౌంట్ తో రూ.15,999 కే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ పాత ఫోను ఎక్స్చేంజ్ చేసుకుంటే గరిష్టంగా రూ.15,250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఇలా చూసుకుంటే మీరు సగం కంటే తక్కువ కేవలం రూ.749 కే ఈ అద్భుతమైన స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.
ఇన్ఫినిక్స్ ఇన్ బుక్ X1 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ : దీని అసలు మార్కెట్ ప్రైస్ రూ.49,999.. కానీ ఫ్లిప్కార్ట్ లో 40 శాతం డిస్కౌంట్ తో రూ.29,990 కే కొనుగోలు చేయవచ్చు అంతేకాదు మీరు మీ పాత ల్యాప్ టాప్ ను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.18,100 డిస్కౌంట్తో రూ.11,890 కే కొనుగోలు చేయవచ్చు.