Smart Phones : స్వాతంత్రానికి ముందే.. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి..!!

Smart Phones : ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఈ స్వాతంత్రానికి ముందే ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ సరికొత్త సేల్ ను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరిట ఎన్నో స్మార్ట్ ఫోన్ లు అలాగే ఉపకారణాలపై ఏకంగా 40% తగ్గింపుతో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది . అంతేకాకుండా ఇదే సమయంలో స్మార్ట్ ఫోన్ ప్రారంభ స్థాయి రూ.6,599 నుంచి ప్రారంభ ధరతో సొంతం కావడం గమనార్హం.అయితే ఈ సేల్ ఆగస్టు ఆరవ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా కొత్త ఫోన్లు , టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా మీరు భారీ తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఇకపోతే ఫ్రీడమ్ సేల్ పేరిట కొత్త ఫోన్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే One plus 10T, iQOO 9T వంటి సరికొత్త స్మార్ట్ ఫోన్లు కూడా ఆగస్టు మూడవ తేదీ నుంచి ఇండియాలో లాంచ్ అవుతూ అమెజాన్లో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మీరు వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే రెడ్మి మీ K50I 5G స్మార్ట్ ఫోన్ కార్డు డిస్కౌంట్ లు అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ల ప్రయోజనంతో రెండవసారి అమ్మకానికి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ.20,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ పై ఇంత భారీ డిస్కౌంట్ ను ప్రకటించడం ఇదే మొదటిసారి.

Huge discount on smart phones before independence
Huge discount on smart phones before independence

ఇక ఇవే కాకుండా శాంసంగ్ గెలాక్సీ M 13, iQOO Neo 6 5G , Techno camon 19 Neo వంటి లేటెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను కూడా మీరు ఈ సేల్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఇక అంతేకాదు ఈ ఫోన్ల ద్వారా మీరు భారీ తగ్గింపును పొందడమే కాకుండా ఈఎంఐ వంటి ఆప్షన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. పాత ఫోన్ లను ఎక్స్చేంజ్ చేసి మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ అందిస్తున్న ఈ సేల్ లో మీరు అమెజాన్ అలెక్సా, కిండ్ల్, ఫైర్ స్టిక్ వంటి గృహ ఉపకరణాలపై కూడా కష్టమర్లు 45 శాతం తగ్గింపు పొందే అవకాశం ఉంది.ఇక లాప్టాప్ వినియోగదారులు కూడా కొన్ని నోట్బుక్లపై ఏకంగా రూ. 40,000తగ్గింపును పొందుతారు. ఇక ఎస్బిఐ బ్యాంక్ కార్డ్ ఉపయోగించేవారికి 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే మొదటిసారి కొత్త కస్టమర్లు కొనుగోలు చేస్తున్నట్లయితే వారికి కూడా 10% క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.