Samsung Smart Phones : సాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. ఆఫర్స్ తెలిస్తే షాక్..!

Samsung Smart Phones : ప్రస్తుతం సాంసంగ్ ఇండియా ఈ మధ్యకాలంలో ఇతర టెక్ సంస్థలతో పోటీ పడి మరీ స్మార్ట్ ఫోన్ల ధరలను తగ్గిస్తుంది. ఇప్పటికే అనేక మోడల్స్ తమ ఉత్పత్తులపై భారీగా ధరలను తగ్గించిన నేపథ్యంలో శాంసంగ్ కూడా తమ స్మార్ట్ మొబైల్ పై ధరలు తగ్గించడానికి సిద్ధమయ్యింది. మరి ఈ క్రమంలోనే భారీ ఆఫర్ తో తీసుకొచ్చిన ఆ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు, ధరలు అన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. సౌత్ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సామ్సంగ్ గెలాక్సీ A సిరీస్ లో మరో స్మార్ట్ఫోన్ ధరను తగ్గించిందని చెప్పవచ్చు. ఇకపోతే సామ్సంగ్ గెలాక్సీ A32 స్మార్ట్ ఫోన్ ధర పై రూ. 3500 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇక గతంలో రూ.25,000 లోపు బడ్జెట్లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.20,000 లోపే కొనుగోలు చేసే అవకాశాన్ని సాంసంగ్ అందించింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఇతర డిస్కౌంట్ కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పై పొందవచ్చు. ఇక ఇందులో ఉండే ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,4999. ఇక ఇప్పుడు రూ. 3,500 తగ్గింపుతో రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో బ్యాంక్ ఆఫర్స్ తో అలాగే తక్కువ ధరకే ఈ మొబైల్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఆసమ్ బ్లాక్, ఆసమ్ బ్లూ, ఆసమ్ వైలెట్ కలర్స్ లో లభిస్తుంది.

Huge discount on Samsung smart phones
Huge discount on Samsung smart phones

ఇకపోతే ఇందులో ఉండే ఫీచర్స్ విషయానికి వస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ AMOLED ఇన్ఫినిటీ U డిస్ ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది . అంతేకాదు 90 Hz రీఫ్రెష్ రేటుతో, మీడియా టెక్ హీలీయో G80 ప్రాసెసర్ తో పనిచేస్తుంది ఇక ఇదే ప్రాసెసర్ మనకు వివో Y53S, రియల్ మీ నార్జో 10, రియల్ మీ 6 ఐ, రెడ్మీ 9 లాంటి మోడల్స్ లో ఇదే ప్రాసెసర్ పైన పనిచేస్తాయి. 15 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 + 1UI 3 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాతోపాటు 5 మెగాపిక్సల్ డెప్త్ కెమెరా అమరచబడి ఉంది . సెల్ఫీ కోసం 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాని కూడా అమర్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే Samsung galaxy A32 స్మార్ట్ ఫోన్ పై రూ.5000 వరకు తగ్గింపును పొందవచ్చు.