One Plus TV : తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి వన్ ప్లస్ తమ సంస్థ నుండి అనేక స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు వన్ ప్లస్ నుంచి విడుదలైన అన్ని స్మార్ట్ ఫోన్లు కూడా తక్కువ ధరకు లభించడమే కాదు అద్భుతమైన ఫీచర్లతో కష్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పుడు స్మార్ట్ఫోన్ లాగా స్మార్ట్ టీవీలు కూడా ఇండియన్ మార్కెట్లో భారీ డిమాండ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వన్ ప్లస్ Y1 టీవీ పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ మైనటువంటి ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో టాప్ డీల్ సేల్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సేల్లో భాగంగా మీరు వన్ ప్లస్ వై వన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం వన్ ప్లస్ Y1 32 హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై రూ.5000 వరకు తగ్గింపు ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.19,999 కాగా ఫ్లిప్కార్ట్ అందిస్తున్న టాప్ డీల్స్ లో భాగంగా 25 శాతం తగ్గింపుతో 14,999 రూపాయలకు మీరు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కూడా విధించడం జరిగింది.
ఇక ఈ ఆఫర్ లోపు కొనుగోలు చేసే వారికి రూ. 15 వేల లోపే ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఐదు శాతం తగ్గింపును పొందవచ్చు. అంతేకాదు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ప్రతినెల రూ.2,500 చొప్పున మీరు పే చేసి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.9,000 వరకు ఆదా కూడా లభిస్తుంది. పాత స్మార్ట్ టీవీ ని మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఇస్తే వన్ ప్లస్ వై వన్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.5,999 కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత స్మార్ట్ టీవీ కండిషన్స్ బాగుంటే తొమ్మిది వేల రూపాయల వరకు వర్తిస్తుంది.