Reliance Jio : HP – జియో సరికొత్త ఆఫర్.. ఉచితంగా 100GB డేటా..!!

Reliance Jio : రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను, తక్కువ ధరకే , అద్భుతమైన ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను మరింత ఆకర్షిస్తుంది. ఇక ఈ క్రమంలోనే కస్టమర్లు కూడా జియో అందిస్తున్న ఆఫర్లకు బాగా అలవాటు పడిపోయారు.. ఇప్పుడు తాజాగా మరొకసారి జియో అలాగే హెచ్ పి రెండు సంస్థలు కూడా కలిసి కస్టమర్ ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ను ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్తగా హెచ్పీ లాప్టాప్ కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది అనే ఒక కండిషన్ ని కూడా పెట్టారు. అర్హత కలిగిన హెచ్పి LTE లాప్టాప్ తో జియో సిమ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 365 రోజులపాటు 1500 రూపాయల విలువైన 100 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశం కల్పించడం జరిగింది.

Advertisement

ముఖ్యంగా హెచ్పి లాప్టాప్ మోడల్ లలో..HP 14ef1003tu అలాగే HP14ef1002tu వంటి మోడల్స్ కి ఈ ఆఫర్ లభిస్తుంది. ఇక జియో హెచ్పి స్మార్ట్ సిమ్ లాప్టాప్ ఆఫర్ ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లేదా ఆన్లైన్ లో reliancedigital.in లేదా JioMart.com వంటి ఆన్లైన్ వెబ్సైట్ ల ద్వారా హెచ్పీ స్మార్ట్ లాప్టాప్ ను కొనుగోలు చేసిన వారు ఈ ఆఫర్ ను పొందవచ్చు. ఇకపోతే హెచ్పీ జియో స్మార్ట్ సిమ్ లాప్టాప్ ఆఫర్ కోసం అర్హత ఉన్న పరికరాన్ని మీరు కొనుగోలు చేసిన తర్వాత ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త జియో సిమ్ ని కూడా పొందవచ్చు. ఈ సిమ్ ద్వారా ఒక ఏడాది పాటు చెల్లుబాటు అయ్యే 1500 రూపాయల విలువైన 100 జీబీ డేటాను మీరు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

Advertisement
https://dailytelugunews.com/wp-content/uploads/2022/07/Reliance-Jio-2.jpg
HP – Jio latest offer is 100GB data for free

ఇక డేటా ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబిపిఎస్ పొందవచ్చు. అంతేకాదు హై స్పీడ్ ఫోర్ జి డేటా కోసం మై జియో లేదా జియో డాట్ కామ్ నుండి అందుబాటులో ఉన్న రీఛార్జి ప్లాన్ ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు అధిక వేగాన్ని కూడా ఆస్వాదించడం కొనసాగుతుంది. ఈ లాప్టాప్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు రిలయన్స్ డిజిటల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడం ఉత్తమం. లాప్టాప్ కొనుగోలు చేసిన తర్వాత జియో సిమ్ యాక్టివేట్ చేయమని స్టోర్ ఎగ్జిక్యూటివ్ ను అడిగితే వాళ్లే చేస్తారు. ఇక డాక్యుమెంటేషన్ కోసం మీరు POI, POA వివరాలను అందివ్వాలి. ఇక యాక్టివేషన్ పూర్తయిన తర్వాత హెచ్పి స్మార్ట్ సిమ్ ల్యాప్టాప్ లో జత చేసి ఇస్తారు. ఇక మీరు ప్రయాణంలో ఉన్నా కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ను ఆస్వాదించవచ్చు.

Advertisement