Savings : కేవలం రూ.300 ఆదాతో రూ.10 లక్షలు పొందడం ఎలా..?

Savings : ఏదైనా సరే మనం ఇప్పటి నుంచి డబ్బు ఆదా చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా జీవిస్తారు. ఇకపోతే డబ్బులను దాచుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే ఎంచుకునే మార్గం కూడా సరైనది ఉండాలి. మనం ఏమైనా పథకాలను ఎంచుకునేటప్పుడు రిస్కు ఉండకూడదు.. ఎక్కువ రాబడి రావాలి ..వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఖాతాదారుడు మరణిస్తే ఆ డబ్బుల లో ఏ మాత్రం నష్టపోకుండా నామినీకి చెందాలి అని ఇలా ప్రతి ఈ విషయాన్ని కూడా దగ్గరుండి ఆచితూచి తెలుసుకొని మరి పాలసీలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం పొందాలనుకునేవారు స్టాక్ మార్కెట్ లో డబ్బు ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే ఈ స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కుతో కూడుకున్న పని. కానీ రిస్క్ ను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారు స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇకపోతే డబ్బులు అధిక మొత్తంలో రావడం అనేది అదృష్టంపై ఆధారపడి ఉంటుందని మరికొంత మంది అనుకుంటూ ఉంటారు. ఇక పరిస్థితులను బట్టి వచ్చే లాభాలు కూడా ఆధారపడి ఉంటాయి. రిస్కు మేము చేయలేము అనుకునేవారు మ్యూచువల్ ఫండ్స్లో అదికూడా దీర్ఘకాలిక స్కీం లలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

How to get Rs 10 lakhs with just Rs 300 savings
How to get Rs 10 lakhs with just Rs 300 savings

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.. సుదీర్ఘ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మార్గాలను ఎంచుకోవడం తప్పనిసరి. వాటిలో మీరు కేవలం 300 రూపాయలతో 10 లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే.. నెలకు 300 రూపాయల చొప్పున 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అంతే కాదు మీకు 12 శాతం వడ్డీ రేట్లు కూడా లభించనున్నాయి. ఇక మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత ఒకేసారి మీ చేతికి 10 లక్షల రూపాయలు వస్తాయి. భవిష్యత్తులో ఆర్థిక నష్టం లేకుండా సంతోషంగా జీవించవచ్చు.