Business Idea : తక్కువ పెట్టుబడి తో నెలకు రూ.30 వేల ఆదాయం ఎలా అంటే..?

Business Idea : ముఖ్యంగా చాలామంది ఉద్యోగం కంటే ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు ఈ బిజినెస్ చేయడంలో భాగంగానే కొత్త పుంతలు తొక్కిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం లేదా బిజినెస్ చేయాలని ఆలోచన , కొంత డబ్బు సమకూరి దేశాలు కొత్త బిజినెస్ చేస్తూ సరికొత్త లాభాలను అర్జిస్తున్నారు . అంతేకాదు దేశ విదేశాలలో కూడా చాలామంది ఇలా సొంతంగా ఏదైనా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్న వారీ ఎక్కువగా ఉండడం గమనార్హం. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో ఉద్యోగం చేయడం కంటే వ్యవసాయం లేదా వ్యాపారం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలి.

అని ఆలోచిస్తే మీకోసం ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాను మేము మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే విదేశాలతో సమానంగా మన దేశం కూడా వాహనాల వినియోగంలో పోటీ పడుతుంది. రోజు రోజుకు వాహనాలను ఉపయోగించే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలోని వాహనాలకు బాగా డిమాండ్ పెరుగుతోంది.. ఇక డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త కొత్త వ్యాపారాలు కూడా పుట్టుకొస్తున్నాయి . అలాంటి వాటిలో ఒకటి కారు వాషింగ్ బిజినెస్ కూడా ఒకటి. ఇక నేడు కార్లు మరియు ఇతర వాహనాలను కడగడం కూడా ఒక మంచి బిజినెస్ అని చెప్పవచ్చు . ఇటీవల కాలంలో దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా ఎంతోమంది యువత ఇలా కారు వాషింగ్ బిజినెస్ ని మొదలుపెట్టి మంచి డబ్బు సంపాదిస్తున్నారు. అంతేకాదు ఖర్చులకు పోయి మీకు కనీసం 70 శాతం వరకు ఆదా అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు

How to earn Rs.30 thousand per month with less investment
How to earn Rs.30 thousand per month with less investment

నిజానికి ఇటీవల చాలామంది సొంత వాహనాలను పొందడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ తమ వాహనాలను శుభ్రం చేసుకోవడానికి మాత్రం వారి దగ్గర సమయం లేదు. ముఖ్యంగా కార్ లేదా బైకును చాలామంది ప్రజలు శుభ్రం చేయడానికి వాషింగ్ సెంటర్లలోనే ఇవ్వడానికి ఇష్టపడడం గమనారం. ఇక వారి ఆలోచన మీకు లాభార్జనగా మారుతుంది అయితే ఈ వ్యాపారం తక్కువ ఖర్చుతో కూడుకున్నది పైగా మంచి లాభాలను కూడా ఇస్తుంది ముఖ్యంగా ఈ బిజినెస్ చేయడానికి గనుక మీరు కంకణం పూనుకుంటే కచ్చితంగా మంచి లాభాలను పొందవచ్చు. ఇక ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు కేవలం 1500 అడుగుల చదరపు స్థలము , కనీసం ఇద్దరు కార్మికులు, విద్యుత్ కనెక్షన్, నీరు , కారు వాషింగ్ స్టాండ్ తో పాటు కొన్ని యంత్రాలు అవసరం అవుతాయి.

ముఖ్యంగా కస్టమర్లు కూర్చోవడానికి, వెహికల్ పార్క్ చేయడానికి కొంచెం స్థలం అలాగే వాటర్ పంప్లను ఇన్స్టాల్ చేసుకోవడానికి మరి కొంత స్థలం ఉంటే సరిపోతుంది. ఇక ముందుగా కొన్ని ఎయిర్ కంప్రెసర్, ఫోమ్ జెట్ సిలిండర్ తో పాటు హై ప్రెషర్ వాటర్ పంప్ అలాగే వాక్యూం క్లీనర్ తప్పనిసరిగా తీసుకోవాలి .ఈ యంత్రాలన్నీ ఏం పెద్ద ఖరీదైనవి కాదు. మీరు సొంత స్థలంలోనే ఈ వ్యాపారం మొదలుపెడితే మరీ మంచిది. మీకు ఈ వ్యాపారానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా కేవలం రెండు లక్షల లోపే లభిస్తాయి. కనీసం 20 వాహనాలను వాషింగ్ కోసం వస్తే కనీసం మీకు 3000 రూపాయలు లభిస్తుంది. ఖర్చులన్నీ తీసివేసిన ప్రతిరోజు రూ. 2000 చొప్పున నెలకు 60 వేల రూపాయలను మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక మీకు కష్టమర్స్ పెరిగే కొద్దీ డబ్బు కూడా పెరుగుతుంది.