SmartPhone : సాధారణంగా ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి అత్యవసర వస్తువుగా మారిపోయిన నేపథ్యంలో ఒక్కొక్కసారి అవి దొంగతనాలకు కూడా గురి అవుతున్నాయి. మనమే ఒక్కొక్కసారి అజాగ్రత్త వల్ల ఎక్కడైనా పెట్టి మరిచిపోవడం ఆ తర్వాత వాటిని ఎవరైనా దొంగలించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ఇక మన స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు.. ఎవరు.. దొంగతనం చేస్తారో తెలియదు కాబట్టి మనం కూడా అంత అప్రమత్తంగా ఉండమని చెప్పాలి . కానీ ఒక్కసారిగా మన ఫోన్ దొంగలించబడింది అని తెలిసిన వెంటనే అందులో ఉండే డిజిటల్ యాప్స్ అలాగే పూర్తి సమాచారాన్ని ఎలా బ్లాక్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఒకవేళ మీరు కూడా స్మార్ట్ ఫోన్ పోగొట్టుకొని అందులో డిజిటల్ యాప్స్ ను బ్లాక్ చేయలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ట్రిక్ తో మీ డబ్బును మీరు పొందవచ్చు. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన యాప్స్ అయినటువంటి గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే లాంటివి బ్లాక్ చేయాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు వీటిని డిలీట్ చేసుకోవడం ఎలా అనే విషయం చాలా మందికి తెలియదు. ఇకపోతే వీటిని ఎలా బ్లాక్ చేయాలి అంటే గూగుల్ పే ను మీరు బ్లాక్ చేయాలి అంటే.. 18004190157 కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేసి.. అధర్ ఇష్యూస్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇక ఆ తర్వాత స్పెషలిస్ట్ తో మాట్లాడే ఆప్షన్ ఎంచుకొని మీ అకౌంట్ బ్లాక్ చేయమని చెప్పి..
గూగుల్ రిజిస్టర్ నెంబర్ చెప్పాల్సి ఉంటుంది .దీంతో వీరు వెంటనే బ్లాక్ చేస్తారు.Android.com/find అని ఆప్షన్ ద్వారా మీరు మీ గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఆ తర్వాత ఎరేజ్ డేటా ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇక దీనివల్ల ఫోన్లోని మొత్తం డేటా డిలీట్ అవుతుంది. ఇక ఫోన్ పే వాడేవారు 08068727374 అలాగే 02268727374 నెంబర్లకు కాల్ చేసి.. కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడిన తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, చివరి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తెలిపితే వారు మీ అకౌంటు బ్లాక్ చేస్తారు. ఇకపై మొబైల్ పోయినా కూడా మీ అకౌంట్లో డబ్బు సేఫ్ గా ఉండాలి అంటే ఇలా డిజిటల్ అకౌంట్స్ ని మీరు బ్లాక్ చేస్తే తీసుకున్నవారు మీ అకౌంట్ ను ఏమి చేయలేరు.