Work From Home : వామ్మో.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇన్ని రోగాలా..?

Work From Home : గత రెండు సంవత్సరాల నుండి కరోనా మహమ్మారి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా నే.. ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లో ఉండి చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఇలా వర్క్ ఫ్రం హోం చేయడం చాలా మందికి సులభమైన పద్ధతి అయినప్పటికీ ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే వర్క్ ఫ్రం హోం పేరిట జాబ్ చేసేవారు ఒకేచోట కూర్చుని గంటల తరబడి పని చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలను మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం..

ఒకే దగ్గర కూర్చొని గంటల తరబడి పని చేయడం వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది అట .. ఎందుకంటే పక్కకి కదలకుండా ఒకే చోట పని చేస్తూ ఉండడం వల్ల శరీరంలో జీర్ణశక్తి తగ్గి , బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి మనకు వస్తుందట. అంతేకాదు ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి తో పాటు కళ్ల కింద నల్లటి వలయాలు , చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు జుట్టు రాలిపోవడం, తరచూ ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి.

How many diseases do those who do work from home
How many diseases do those who do work from home

గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం వల్ల చర్మం పొడిబారిపోవడం, అందవిహీనంగా తయారవడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. తీవ్రమైన ఒత్తిడి, ముఖం మీద ముడతలు, మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మీరు కూడా వర్క్ ఫ్రం హోం పేరిట గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తున్నట్లు అయితే వెంటనే మీ పని నుంచి కొంత ఉపశమనం పొందడానికి ప్రయత్నం చేయండి.. వీలైతే గంటకు ఒకసారి అటూ ఇటూ తిరగడం, వ్యాయామం చేయడం , సాయంత్రం సమయంలో ఇలాంటివి చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.