Latest Important case : అనంతపురం పోలీసులు ఎన్నో కేసులను అలవోకగా చేదించారు.. కొన్ని మిస్టరీలను సైతం చాకచక్యంగా పరిశీలించి నేరగాలను జైలు పాలు చేశారు.. కానీ నాలుగు నెలల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు మాత్రం వారికి సవాలుగా మారింది.. ఓ ఇంటి మొత్తానికి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపలికి బయట వాళ్ళు వచ్చే అవకాశమే లేదు. కానీ హత్య జరిగింది. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది మాత్రం నిజం..
అనంతపురంలోని జిఎస్ నగర్ లోని బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్న భయపు రెడ్డి సుజాత దంపతులు. రాత్రి సమయంలో ఎక్కువసేపు ఆమె భర్త హాస్టల్లోనే గడుపుతాడు. హాస్టల్ బిజినెస్ వారికి బాగానే కలిసి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు విష్ణువర్ధన్ రెడ్డికి ఈ సంవత్సరమే పెళ్లయింది. పెళ్లయి పది రోజులు ముగియకుండానే సుజాత మరణించింది. దాంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ఆమె చనిపోయే రోజు రాత్రి కూడా ఇంటి చుట్టూ మొత్తం గడియలు వేసి సుజాత తండ్రి ఆ ఇంటికి కాపలాగా బయట పడుకుని ఉన్నాడు. కానీ సుజాత ఉదయం లేచి చూసేసరికి శవమై ఉంది. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి వెంటనే కంప్లైంట్ ఇచ్చాడు సుజాత తండ్రి. పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా పలు విషయాలు తెలిసాయి.
సుజాత హాస్టల్ విషయంలో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చింది. అతను డబ్బులు తీసుకుని ఆమెను మోసం చేసాడు అన్న సంగతి వెలుగులోకి వచ్చింది. కానీ సుజాతను చంపింది మాత్రం ఆయన కాదు. ఆమె కొడుకుని కూడా అనుమానించి విచారణ చేశారు. అతను కూడా కాదని తెలిసిందే. అప్పుడే మరో విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నడుపుతున్న సమయంలో సుజాతను ఓ యువకుడు వేదించాడు. అతనిపై సుజాత పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టగా ఆ ఘర్షణలో సుజాత ఆ యువకుడిని అందరి ముందే చెప్పు తీసుకొని కొట్టింది.
ఇప్పుడు ఆ యువకుడే ఆమెను చంపి ఉంటాడు అని అంతా అనుకుంటున్నారు. ఆ అవసరం అతనికి తప్ప మరి ఇంకెవరికి లేదని స్పష్టమవుతుంది. ఇక అదే విషయాన్ని పోలీసులు కూడా ఫైనల్ చేశారు. కాకపోతే ఆధారాలు తెలియకుండా బయటకు చెప్పలేరు. కనుక ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. మిస్టరీగా ఉన్న ఈ కేసు త్వరలోనే సాక్షాదారాలతో అసలు నిందితుడు ఎవరో తెలపనున్నారు పోలీసులు.