TDP – Sivaji : ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ విజయాలపై నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు..!!

TDP : నటుడు శివాజీ అందరికీ సుపరిచితుడే. తెలుగు సినిమా రంగంలో అనేక విభిన్నమైన పాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా రాణించారు. 2014లో ఏపీలో టీడీపీ గెలిచాక.. ప్రత్యేక హోదా విషయంలో శివాజీ కీలకంగా పోరాటం జరిగింది. ఆనాడు ప్రత్యేక హోదా సాధన సమితి అంటూ పలు పోరాడిన కీలక నాయకులలో శివాజీ కూడా ఒకరు. అదే సమయంలో ఆపరేషన్ గరుడా అంటూ రాష్ట్రంలో ఒక సంచలన నేత అరెస్టు కాబోతున్నారని.. రకరకాల విశ్లేషణలు చేసి పొలిటికల్ వార్తల్లో హైలైట్ అయ్యారు. కానీ 2019లో వైసీపీ గెలిచాక శివాజీ చాలా వరకు కనుమరుగైపోయారు. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీని ఎంపీగా పార్లమెంట్ సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో నటుడు శివాజీ పాల్గొన్నారు.

Advertisement
Hero Sivaji comments on AP mlc elections
Hero Sivaji comments on AP mlc elections

ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని నిర్మించింది గాంధీ కుటుంబం అని పొగడ్తలతో ముంచెత్తారు. చాలామంది దేశరాజకీయాల్లో పదవుల్లోకి వచ్చి ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ దేశం కోసం ఆస్తులు అమ్ముకుని కాంగ్రెస్ పార్టీ కీలక నేత జవహర్ లాల్ నెహ్రూ ఎన్నో మంచి పనులు చేశారని చెప్పుకోచ్చారు. అటువంటి కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే గత మూడు రోజుల నుండి నిద్ర పట్టలేదు. కచ్చితంగా ఈ ఒక్కసారికి పార్టీలను పక్కనపెట్టి అందరం కలిసి గాంధీ కుటుంబానికి అండగా నిలబడటం దేశం కోసం ఏకమవుదమని శివాజీ పిలుపునిచ్చారు.

Advertisement

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టాబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పట్టాభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించారు. కానీ అక్కడ టీడీపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రజలు మార్పు కోరుకోవడానికి రెడీగా ఉన్నారు. నాయకులే సిద్ధం కావడం లేదు. కనుక ఈసారి రాహుల్ గాంధీ కోసం ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలని.. గాంధీ కుటుంబాన్ని కాపాడుకోవాలని నటుడు శివాజీ వ్యాఖ్యానించారు.

Advertisement