Ram: దేవదాసు సినిమాతో వెండి తెరకు పరిచయమైన చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని.. హీరోగా రికార్డులు క్రియేట్ చేసిన రామ్ పోతినేని ఇప్పుడు లేటెస్ట్ గా నటించిన ది వారియర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచినా కానీ బాలీవుడ్ లో రీసెంట్ గా డబ్బైంది. కాకపోతే అక్కడ ఈ సినిమా 100 మిలియన్ మార్క్ అందుకుని.. సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకుపోతోంది.. అయితే రామ్ కి 100 మిలియన్ మార్క్ అందుకున్న 7వ చిత్రం కావడం విశేషం..
రామ్ పోతినేని నటించిన సినిమాలకు తెలుగు తో పాటు హిందీ లో కూడా సాలిడ్ డిమాండ్ ఉంటుంది.. తన సినిమాలకు హిందీ లో డబ్ చేసిన తర్వాత వచ్చే వ్యూస్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో వస్తున్నాయి. సౌత్ లోనే అత్యధిక 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న చిత్రాలు రామ్ పోతినేనివే ఎక్కువ.. రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, నేను శైలజా, హైపర్, ఇస్మార్ట్ శంకర్, గణేష్ సినిమాలు 100 మిలియన్ మార్క్ ని అందుకోగా.. ఇప్పుడు వారియర్ మూవీ 7వ 100 మిలియన్ మార్క్ మూవీగా సంచలనం సృష్టించింది.. అయితే మరే సౌత్ హీరోకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ బాలీవుడ్ లో లేదనే చెప్పాలి. రామ్ సినిమాలంటే బాలీవుడ్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎగబడుతుండటం చూస్తుంటే.. రామ్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ లో రామ్ పోతినెని 7 సినిమాకు బాలీవుడ్ లో 100 మిలియన్ మార్క్ ను అందుకున్నారు.