Netflix : ఇటీవల కాలంలో ప్రముఖ ఓటీటీ యాప్ లు అయినటువంటి నెట్ ఫ్లెక్స్ , డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి యాప్ లను ఉచితంగా యాక్సిస్ చేసుకోవాలి అంటే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ అందిస్తున్న కొన్ని రకాల రీఛార్జ్ ప్లాన్స్ బాగా పనికి వస్తాయి.. ఈ రీచార్జ్ ప్లాన్స్ ద్వారా మీకు ఉచితంగా ఈ ఓటీటీ యాప్ లను సబ్స్క్రిప్షన్ చేసుకోవడంతో పాటు అదనంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ డేటా అలాగే ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందవచ్చు. మరి ముఖ్యంగా నెట్ ఫ్లెక్స్ మీరు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొంది అనేక సినిమాలను వీక్షించే సదుపాయం పొందాలి అంటే భారతీ ఎయిర్టెల్ అందిస్తున్న కొన్నిరకాల రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు..
రూ.1199 ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ : భారతి ఎయిర్టెల్ అందిస్తున్న ఈ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఒకటి సాధారణ మరియు 2 యాడ్ ఆన్ కనెక్షన్లతో వస్తుంది. ఇక ఈ ప్లాన్ వినియోగదారులకు 150 GB డేటా తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు అపరిమిత వాయిస్ కాలింగ్ అలాగే ఉచిత OTT ప్రయోజనాలను అందిస్తుంది. ఇకపోతే ఓటిటి ప్రయోజనాలతో ఉచిత డిస్నీ ప్లస్ ఆర్ స్టార్ సబ్స్క్రిప్షన్ , నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ అలాగే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ తో కూడిన నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఫ్లాట్ ఫామ్ కు బేసిక్స్ సబ్స్క్రిప్షన్ ని పొందవచ్చు.
రూ.1599 ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా మీకు 250GB డేటా లభిస్తుంది. అంతేకాదు ఈ ప్లాన్ తో ఒకటి సాధారణ మరియు మూడు ఫ్యామిలీ యాడ్ – ఆన్ కనెక్షన్ ని కూడా పొందుతారు. ఇకపోతే అపరిమిత వాయిస్ కాలింగ్ ను పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందుతారు ఇకపోతే భారతీ ఎయిర్టెల్ యొక్క రూ.1199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో సమానంగా ఈ ప్లాన్ తో కూడా పొందవచ్చు. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంటుందని గమనించాలి. ఇకపోతే ఎయిర్టెల్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్లతో పాటు మరికొన్ని ప్లాన్లు కూడా మీకు ఉచిత నెట్ఫ్లిక్స్ అలాగే డిస్నీ ప్లే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ని కూడా అందిస్తున్నాయి .ఇక ఏడాది పాటు పొందాలి అనుకుంటే వాటి ధరలు కూడా మారుతూ ఉంటాయి.