Health tips : ఈ మధ్యకాలంలో చాలామంది తరచూ డయాబెటిస్ భారిన పడుతున్నారు. పూర్వం మన పెద్దలతో పోల్చుకుంటే ఈ కాలంలో 100కి 75 మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు అని చెప్పవచ్చు.మనం తీసుకునే ఆహారంలో మార్పులు.. సరైన జీవనశైలి లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఇలాంటి కారణాలవల్ల డయాబెటిస్ బారిన పడేవారు పెరుగుతున్నారు. మరి కొంతమంది ఊబకాయం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం లాంటి కారణాల వల్ల కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే డయాబెటిస్ సమస్య ఒక్కసారి వచ్చింది అంటే ఇక జీవితాంతం దానిని భరించాల్సిందే. ఇక అందుకే డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి అంటే వైద్యుల సహకారంతో వారు సూచించిన మందులను వాడాల్సి ఉంటుంది. అలాగే అలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక ఆకు మీ డయాబెటిస్ ని కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది.
ఇక అదే ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రి.. మానవుడు ఏదైనా తీరని కోరికతో ఉన్నట్లయితే బిల్వ పత్రిని ఆ మహా శివుడికి సమర్పించి తన కోరికను కోరుకుంటారు. ఇక ఈ క్రమంలోనే డయాబెటిస్ ను నియంత్రించడంలో కూడా బిల్వపత్రి సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్న వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక గుండె, కిడ్నీ , ప్యాంక్రియాస్ వంటి మొదలైన ముఖ్యమైన అవయవాల మీద డయాబెటిస్ ప్రభావితం చూపుతుంది. దీనిని అదుపులో ఉంచుకోవాలి అంటే బిల్వపత్రి చాలా సహాయపడుతుంది.
బిల్వ పత్రి లో మధుమేహాన్ని నిరోధించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి . రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడానికి అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది . ముఖ్యంగా బిల్వపత్రిలో హైపోగ్లైసీమిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి ఇవి సహాయపడతాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్ ను తగ్గిస్తుంది. ఇక ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇక ప్రతిరోజు ఉదయం 3 బిల్వపత్రిలను నమిలి మింగాలి.. లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా సరిపోతుంది. వీలైనంతవరకు ప్రోటీన్ , పీచు పదార్థం తో పాటు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.