నేటి దైనందిత జీవితంలో దేశీయంగా మోకాళ్ళు, కీళ్ల నొప్పులతో అనేకమంది బాధ పడుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా గ్రామాల్లో మరీ ఎక్కువగా ఇలాంటి సమస్యలతో బాధ పడుతున్న జనాలు అనేకం. అందులో మీ తల్లో, తండ్రి కూడా ఉండొచ్చు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు మరింత పెరిగి తీవ్రమై మరిన్ని వ్యాధులకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు ముఖ్యంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా చాలా మందిలో క్యాల్షియం లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వలన కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వాడుతూ వుంటారు. వాటివలన తాత్కాలిక ఉపశమనం అయితే కలుగుతుంది గానీ, దీర్ఘకాలికంగా కాదు. అంతేగాకుండా వీటిని వినియోగించడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని వినియోగించడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ రసాయనలతో కూడిన ఔషధాలకు బదులుగా నిపుణులు తెలిపి కొన్ని డ్రింక్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సోంపు, పసుపుతో పాటు యాలకులు, దాల్చిన చెక్కతో తయారు చేసిన డ్రింక్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు అంటున్నారు. అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ రసాన్ని ప్రతి రోజు తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా కరిగిస్తుంది. ఈ డ్రింక్‌లో అదనంగా బెల్లం తురుమును వినియోగించడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని వినికిడి. ఇక శరీరంలో యూరిక్ యాసిడ్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కీళ్ల నొప్పులతో పాటు గౌట్ నొప్పులు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా యూరిక్ యాసిడ్ లక్షణాలను గమనించి వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పై హోం రెమిడీస్‌ని వినియోగించి కూడా మీరు ఉపశమనం పొందవచ్చు.