Harshavardhan Life Story : హర్షవర్ధన్ కి తన మరణం గురించి ముందే తెలిసింది. మరి దేవుడే చెప్పాడా? లేదా? ఆ యముడు చెప్పాడో తనకి మరణం వస్తుందని తెలిసిపోయింది. అయినా హర్షవర్ధన్ భయపడలేదు. దేవుడా మీరు రమ్మంటున్నారు. నేను వస్తాను కాకపోతే నాకు తమ్ముడు అమ్మ నాన్న నేను అంటే ఇష్టపడే నా స్నేహితులతో గడిపేందుకు సమయం అడిగాడు. ఆ దేవుడు కూడా ఇచ్చాడు.కానీ ఈలోపు తన మృతదేహాన్ని అమ్మానాన్న తమ్ముడు తన స్నేహితులు చూసేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తాను ఉండేది ఆస్ట్రేలియాలో. మూడున్నర లక్షలతో మృతదేహాన్ని ఉంచే పెట్టిన తయారు చేసుకున్నాడు.
ఇతను బీఫార్మసీ పూర్తి చేసి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఒక హాస్పిటల్లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతనికి పెళ్లి కూడా అయింది. ఒకానొక సమయంలో సరిగ్గా ఆయాసంతో కూడిన దగ్గు వచ్చింది. కాసేపు ఊపిరి ఆగిపోయినంత ఆయాసం వచ్చింది.చాతిలో నొప్పి కూడా మొదలైంది. జీవితంలో ఎప్పుడూ అలా అనిపించలేదు. వెంటనే తనకి ఏదో అవుతుందని కీడును శంకించాడు. అయినా సరే అతను కంగారు పడకుండా ముందు ఎవరికీ చెప్పలేదు. ఆరోజు కాసేపు విశ్రాంతి తీసుకొని వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. తనకు తెలిసిన డాక్టర్లకు విషయం చెప్పాడు. అయితే అదే రోజు సాయంత్రం హర్షకు భయంకరమైన విషయం తెలిసింది.ఊపిరితిత్తుల క్యాన్సర్ స్టేజ్ 4 చావు అంచలదాకా వెళ్లే పరిస్థితి.మందులు వాడితే తగ్గొచ్చు ప్రయత్నం చేద్దామని డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.
అదే రోజు రాత్రి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఇక నేను బ్రతకను నాన్న అంటూ బోరున ఏ ఇచ్చాడు. కుటుంబంతో కన్నీళ్లను పంచుకున్నాడు. అయితే ఆ విషయం విన్న తల్లిదండ్రులు వెంటనే ఆస్ట్రేలియా నుంచి వచ్చేయ్ మా ప్రాణం అడ్డు ఏసైనా నిన్ను కాపాడుకుంటాం అని అన్నారు. వద్దు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాను మంచి డాక్టర్లు ఉన్నారు. మీరు టెన్షన్ పడొద్దు అని హర్ష చెప్పాడు. తన భార్యతో నాకు ఈ భూమి మీద ఇంకా అవకాశం లేదు.నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్స్ దాంతోపాటు సారీ అని చెప్పాడు.ఆమె జీవితంలో సెటిల్ అయ్యేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత కొద్ది రోజులకు హర్ష బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటానని చెప్పి వెంటనే శ్వాస వదిలాడు.