Hair Tips: వారం లో ఎక్కువ సార్లు తలస్నానం చేసే వాళ్ళు — ఈ న్యూస్ తప్పకుండా చదవాలి !

Hair Tips: వారంలో కొంతమంది రెండు సార్లు తలస్నానం చేస్తారు. మరికొంత మంది రోజు తలస్నానం చేస్తుంటారు. రెండు సరైనవి కావు. మీ జుట్టు తత్వాన్ని బట్టి తల స్నానం చేయాలి. మీరు రోజు తలస్నానం చేయాలి అనుకుంటే.. ఈ చిన్న చిట్కా ఫాలో అయితే చాలు.. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది..

Hair tips Head Bath every keeradosa juice helps hair growth
Hair tips Head Bath every keeradosa juice helps hair growth

కీర దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కీరదోస ఆరోగ్యానికే కాదు.. కేశాల సంరక్షణకు కూడా మంచిదే. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టుకి ఎంతో మేలు చేస్తాయి. జుట్టు సంబంధిత సమస్యలను తొలగిస్తాయి. ముందుగా ఒక కీరదోస ను తీసుకొని దానిని చెక్కు తీసి సన్నగా తరగాలి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు రాసుకోవాలి. తరువాత చల్లటి నీళ్లతో మైండ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టుకు కావాల్సిన పోషణను తేమను అందించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మీరు ప్రతిరోజు తలస్నానం చేస్తుంటే కీరదోసరసంలో తలపై స్ప్రే చేసుకుని ఒక గంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోండి. రోజు ఇలా చేస్తుంటే తలస్నానం చేసే ముందు చేస్తుంటే జుట్టుకి సహజ సిద్ధమైన మెరుపును అందించడంతోపాటు జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.