Hair Tips : జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోందా.!? ఇలా చేస్తే ఊడమన్న ఊడదు.!

Hair Tips :  శీతాకాలంలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యలలో జుట్టు రాలడం కూడా ఒకటి. చలికాలంలో విచ్చే చల్లని గాలి జుట్టులోని తేమను గ్రహిస్తుంది. జుట్టుని బలహీనంగా, పెలుసుగా మారుస్తుంది. అందుకే చలికాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. మీ ఇల్లు అందంగా ఒత్తుగా పెరగడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి చాలు..!

hair-fall-check-these-packs-and-fast-hair-growth
hair-fall-check-these-packs-and-fast-hair-growth

జుట్టును ఆరోగ్యకరంగా పెంచడానికి మెంతులు అద్భుతంగా సహాయపడతాయి. మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్టులాగా చేసుకోవాలి. ఇందులో ఒక చెంచా ఆవనూనె లేదంటే కొబ్బరి నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తల స్నానం చేయాలి. మెంతులు తలలో ఉన్న వేడిని లాగేయడంతోపాటు జుట్టు రాలకుండా చేస్తుంది. ఇంకా సిల్కీ హెయిర్ మీ సొంతం.

ఉల్లిపాయ రసాన్ని తీసుకొని దానిని జుట్టు మొదలు నుంచి చివరి వరకు రాసుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడం మీరే గమనిస్తారు. ఆవ నూనె కూడా జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది. గోరువెచ్చటి ఆవ నూనె తలకు రాసుకొని మర్దన 10 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత నీటిలో పిండిన తడి బట్టను తలకి చుట్టుకోవాలి. ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కోడిగుడ్డులో జుట్టుకి కావలసిన ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసోనలో ఒక చెంచా పెరుగు వేసి బాగా గిలగొట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గోరువెచ్చటి నీటితో తల స్నానం చేస్తే జుట్టు రాలకుండా ఉండటంతో పాటు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.