Hair: ” జుట్టు కత్తిరిస్తే ఎక్కువ పెరుగుతుంది అంటారు ” ఇందులో నిజమెంత !

Hair: జుట్టును పెద్దగా పెరగాలని చాలా మంది కోరుకుంటారు.. మహిళల్లో జుట్టు పెరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలడాన్ని నివారించడానికి ట్రిమ్ చేయమని చాలా మంది మీకు సలహా ఇస్తుంటారు. జుట్టు చిక్కులు పడినప్పుడల్లా ఊడిపోతుంటుంది. దీంతో జట్టును కత్తిరిస్తుంటారు. జుట్టును కత్తిరిస్తుంటే వేగంగా పెరుగుతుందని చెబుతుంటారు. నిజంగానే హెయిర్‌కట్‌ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

Hair Cutting method helps hair growth
Hair Cutting method helps hair growth

జుట్టును కత్తిరించుకుంటూ ఉంటే, వారి జుట్టు పొడవుగా పెరుగుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ జుట్టును కత్తిరించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. జుట్టు కత్తిరించుకుంటే.. ఆగిపోయిన ఎదుగుదల మళ్ళీ పెరుగుతుందనేది భావించి మీరు జుట్టు కత్తిరించుకుంటే అది పొరపాటేనని చెబుతున్నారు. జుట్టు చివరలను కత్తిరించడం, వాటి పెరుగుదల మధ్య ఎటువంటి సంబంధం లేదు. జుట్టు కత్తిరిస్తే.. జుట్టు కుదుళ్లపై ప్రభావం ఉండదు. ఇది మీ జుట్టు పెరుగుదలను ప్రభావితం చేయదు.

జుట్టు ఒత్తుగా పెరగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. తలకి నూనెతో మసాజ్ చేసుకుంటే మంచిది. క్రమం తప్పకుండా మసాజ్ చేసినప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి. హెయిర్ మసాజ్ సమయంలో నూనె ఫోలికల్‌లోకి చొచ్చుకుపోతుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

మసాజ్ చేసేటప్పుడు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీని కారణంగా సరైన పోషకాలు, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు చేరుతాయి. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నూనె వాడాలి అని ఆలోచిస్తే కొబ్బరి నూనె, ఆముదం, లేదా బాదం నూనె మంచిది. ప్రతి వారం వాటిని మసాజ్ చేయడం వల్ల మీ డ్యామేజ్ అయిన జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

 

పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా కనిపించే పొడవాటి జుట్టు కలిగి ఉండటం వల్ల ప్రయోజనం లేదు. జుట్టు పొడవుతో పాటు, వారు మందంగా, బలంగా ఉండటం కూడా చాలా ముఖ్యం.