Kodali Nani : మాజీమంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గ గుడివాడలో నూతనంగా పురపాలక శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు నాని మంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్యాలయం ఏర్పాటయింది ఆ సమయంలో మంత్రి నాని నిలువెత్తు ఫోటోను కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఉంచారు తరువాత ఆయన తన మంత్రి పదవిని కోల్పోయారు అయినప్పటికీ ఆ ఫోటో ఇంకా అక్కడే ఉంచారు ఇప్పటికీ నాని చిత్రాన్ని పురపాలక శాఖ నుంచి తొలగించకపోవడంతో ఈ ఫోటోపై పలు విమర్శలు వస్తున్నాయి తాజాగా మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు..!
మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ గుడివాడ పురపాలక సంఘ కమిషనర్ సంపత్ కుమార్ కు.. ఆయన ఫోన్ చేసి నాని చిత్రపటాన్ని కార్యాలయంలో తొలగించారని చెప్పారట.. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కి సంబంధించిన ఫోటోలు మాత్రమే ఉంచాలని.. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలు పెట్టడం సరికాదని.. ఇదేమి పద్ధతి అని ఆయన ప్రశ్నించారు .. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ఫోటోను వారం రోజుల్లో తొలగించాలని.. అలా చేయని పక్షంలో ధర్నా చేయడానికి అయినా సిద్ధమేనని మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది..

కొడాలి నాని ఉన్న చిత్రపటాన్ని తొలగించి వెంటనే ఆ స్థానంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.. మరి ఈ విషయంపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు రాజకీయాల వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ కు ప్రతి చర్యగా నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..